21, డిసెంబర్ 2013, శనివారం

మనకన్నా పెద్ద నియంత....!!

మనకు ఎన్ని ఉన్నా మన దగ్గర లేని దాని గురించే మన ఆలోచనంతా ఉంటుంది... ఎందుకో మరి ఇష్టంగా కూడా అనిపిస్తుంది..అందని ద్రాక్ష పుల్లన కదా...మరెందుకో ఇలా...!! మన దగ్గర ఉన్న విలువైన దాని గురించి పట్టించుకోకుండా ఎడారి ఎండమావుల వెంట పరుగులు తీస్తూ సేదదీర్చే ఒయాసిస్సులని భ్రమ పడుతూ అలసి పోయినా కూడా...ఆయాసపడుతూ వాటి కోసం పరుగులు తీస్తూ ఉంటాము... మన నైజం ఇదేనేమో....!!
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత....మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె సామెతలు  గుర్తు వస్తూ నవ్వు వచ్చేస్తుంది ఒక్కోసారి...మనం ఎదుటివారికి చెప్పే నీతులలో కనీసం ఒక్కటి ఆచరించినా మన జీవితం ధన్యమైనట్లే...!! మన ఒక వేలు ఎదుటి వారిని చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు మనని చూపిస్తాయి...కాని మనలోని లోపాన్ని మనకు తెలిసినట్లు ఉండకుండా అంతరాత్మ నోరు నొక్కేసి మనం చెప్పిందే వేదం అంటూ హుంకరిస్తూ మన ప్రతాపాన్ని అందరికి గుర్తు చేస్తూ గొప్పగా భావిస్తాం...ఈ రోజు మన ముందు పొగిడిన వాళ్ళే మనం కనుమరుగు కాగానే మన లోపాలను ఎత్తి చూపుతూ అవహేళన చేస్తారని మనకు తెలుసు.. అయినా అబద్డంలోనే ఆనందం బావుందని అలానే ఉండి పోతాం...నిజాన్ని దగ్గరకు రానీయకుండా...!! అందుకే నిజం అలా మనలోనే అంతర్లీనంగా లోపలే ఉండి పోతోంది...మనం ఎలా ఉంటున్నాము అని ఒక్కసారి నిజాయితీగా ప్రశ్నించుకుంటే...?? ఎప్పుడైనా మనం ఎదుటివారికి ఇచ్చేదే మనకు తిరిగి వస్తుంది...తప్పదు దాన్ని అలానే అందుకోవాలి..మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు కదా...!! కాకపొతే అందరు గాంధీలు, మథర్ తెరీసాలు ఉండరు...అందుకే మనం ఇచ్చింది మను గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తే తీసుకోవాలి తప్పదు మరి..మనం ఇచ్చింది మనకు ఇష్టం లేక పొతే ఎలా...!! ఎంత సేపు ఎదుటి వారిలో లోపాలు వెదక కుండా కాస్త మంచిని చూడగలిగితే మనసుకు జీవితానికి ప్రశాంతత వస్తుంది...మనమే నియంతలం అనుకుంటే మనకన్నా పెద్ద నియంత ఒకడు ఉన్నాడు వాడు మన లెక్కలు వేస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు...!! అర్ధం ఐంది కదూ ఆ నియంత ఎవరో....!! -:)

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

"ఎప్పుడైనా మనం ఎదుటివారికి ఇచ్చేదే మనకు తిరిగి వస్తుంది....తప్పదు దాన్ని అలానే అందుకోవాలి....మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు కదా....! ..... ఎంత సేపు ఎదుటి వారిలో లోపాలు వెదక కుండా కాస్త మంచిని చూడగలిగితే మనసుకు జీవితానికి ప్రశాంతత వస్తుంది..."
మంచి మాటలు, మంచిని చూడగలగడం, మనం విత్తిన విత్తే ఫలం అవుతుందొకనాడు అని, అలాగే మనం ఎదుటివారికి ఇచ్చిందే తిరిగి పొందగలం అని చెప్పడం .... నిజంగా ఆణిముత్యాలు లాంటి మాటలు.
అభినందనలు మంజు యనమదల గారు

చెప్పాలంటే...... చెప్పారు...

మీ మనసు స్పందనకు వందనాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner