29, డిసెంబర్ 2013, ఆదివారం

మన ఖర్మకి మనమే భాద్యులము...!!

ఏ కన్నతల్లి పిల్లలని చెడ్డవారుగా కావాలని పెంచదు....మనం ఇష్టపడి బంధాన్ని పెంచుకుని కష్టం వచ్చిందని ఆ బిడ్డను కన్నతల్లిని నిందించడం ఎంత వరకు సబబు చెప్పండి..!! మన అవసరానికి అత్తను మామను వాడుకుని మనకంటూ ఓ గొప్ప పట్టా వచ్చాక మన ఉన్నతి కోసం మన పిల్లల ఆలనా పాలనా చూసిన వారిని మర్చిపోవడం...!! మన ఇంటి విషయంలో వారిని నిందించడం...!! పెంచిన పిల్లలని చూడకూడదని ఆంక్షలు పెట్టడం..!! తాతల ఆస్థి మనవలకు చెందాలి కాని కంటితో చూసుకునే భాగ్యం మాత్రం లేదు..పెంచిన ప్రేమను చంపుకోమనడం...ఆ ముసలి ప్రాణాలు ఎంత క్షోభను అనుభవిస్తాయో.... కాపురాలు కూలిపోయిన బాధ ఓ పక్కా... కనీసం మనవలను చూసుకోలేని దౌర్భాగ్యం... వీటికి తోడూ ఈ శూలాల లాంటి మాటలు....తట్టుకోగలవా....ఆ ప్రాణాలు...!!
మీరు ఇష్ట పడినప్పుడు అంతా మంచిగానే కనిపించింది ఇద్దరిలో ఇద్దరికీ... ఉన్నప్పుడు బయటి ప్రపంచంతో పని ఉండదు అనుకుంటా...ఒక్కసారిగా భాద్యతలు బంధాలు వచ్చేసరికి డబ్బులు ముఖ్యం అయ్యి ఎదుటి వారిలో లోపాలు చూడటం మొదలు అవుతుంది...చిన్నవే భూతద్దంలో పెద్దవిగా చేసుకుని ఏ ఒక్కరు సరిపెట్టుకోలేక తమకున్న అహాన్ని వదులుకోలేక ఎంతగానో ఇష్ట పడిన బంధాన్ని తెంచుకుని పిల్లలని బలి పశువులను చేస్తూ తమతో ముడివేసుకున్న అనుబంధాలను వదిలించుకుంటూ... తమ దారిన తాము పోతూ కన్నవాళ్ళను పెంపకం గురించి ప్రశ్నిస్తారు...!! ప్రేమించినప్పుడు గుర్తుకు రాని పెంపకం విడిపోయినప్పుడు గుర్తుకు వస్తుంది మరి...అదేంటో...!!
నేను పొరపాటుగా ఈ మధ్యనే ఒక మాట అనేసాను..  అది అనుకోకుండా వచ్చేసింది...ఈ లోకంలో లేని ఆ తల్లిని అనడం నా తప్పే....ఆవిడని అనాలని ఎప్పుడు లేదు కాని కోపంలో పొరపాటుగా  అలా వచ్చేసింది...ఈ లోకంలో లేని ఆ తల్లికి ఇలా నా క్షమాపణలు చెప్పుకుంటున్నాను...నా తప్పుని మన్నించమని మనస్పూర్తిగా అడుగుతున్నా...!! అందుకే పెద్దలు చెప్పిన మాటలు గుర్తు ఉంచుకోవాలి మనం " కాలు జారితే తీసుకోగలం కాని మాట జారితే వెనక్కు తీసుకోలేము" అని ... తల్లి మనసు ఎప్పుడు ఏ తల్లిదయినా ఒకేలా ఉంటుంది...మన తప్పులకు కన్నతల్లులను నిందించకూడదు.....!! మన ఖర్మకి మనమే భాద్యులము...!! జారిపోతున్న జీవితపు విలువలు అన్ని డబ్బుతో ముడి పడి పోతూ ఆధునికత ముసుగులో కొట్టుకు పోతున్నాయి....రాను రాను రోజులు ఎలా ఉంటాయో...కనీసం అమ్మా నాన్న బంధాలు కూడా పుస్తకాల్లోనో లేదా నీతులు చెప్పే నీతి  చంద్రికలలోనో పరిమితం అయిపోతాయేమో...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

పెంచిన పిల్లలని చూడకూడదని ఆంక్షలు ...., తాతల ఆస్థి మనవలకు చెందాలి .... కాని, పెంచిన ప్రేమను చంపుకోవాలి. ఆ ముసలి ప్రాణాల క్షోభ .... కాపురాలు కూలిన బాధ .... కనీసం మనవలను చూసుకోలేని దౌర్భాగ్యం .... శూలాల లాంటి మాటలు
మమతానురాగాలు ఇప్పుడు ఏక పక్షంగానే మిగిలి ఉంటున్నాయి .... దురావస్థ. అందరూ ఆలోచించాల్సిన విషయం.
అభినందనలు మంజూ గారు! శుభసాయంత్రం!!

చెప్పాలంటే...... చెప్పారు...

మీ మనసు మాటల స్పందనకు వందనాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner