25, డిసెంబర్ 2013, బుధవారం

ఇక అందరు ఆ పనిలో ఉండండి....!!

ఎందుకొచ్చిన బాధలు, ఆవేశాలు, కోపాలు, కష్టాలు, కన్నీళ్ళు... మనకు మనసు ఉంది అనుకుంటేనే కదా ఇవి అన్ని...!! అందుకే ఆ మనసు మనలో లేదని ఓ క్షణం అనుకుని చూస్తే పోలా...!! అసలు చిక్కల్లా మనకు ఈ మనసుతోనే... మనం ఇష్టపడినా... ద్వేషించినా....దేనికయినా దీని మాట వింటేనే అది మనల్ని బానిసలుగా చేసుకుంటూ మనతో ఆడుకుంటోంది...!! అందుకే మనసుని పక్కన పెడితే ఎలా ఉంటుంది...!! ఎలాగు అందరికి ఉండదనుకోండి ఈ మనసు...అది కొందరిదే కానీ అందరిది కాదు...!!
మనసున్న ఆ కొందరు దానితో తంటాలు పడుతూ దాని ఇబ్బంది పెడుతూ వారు ఇబ్బంది పడుతూ ఇష్టం ఉన్నా లేక పోయినా జీవితాన్ని సాగిస్తూ ఉంటున్నారు...అందుకే అ మనసుని మర్చి పొతే ఇక ఏ గోలా ఉండదు...!! మనం సంతోషంగా ఉండాలి అంటే మన మనసుని మర్చి పోవాలి ... ఇక అందరు ఆ పనిలో ఉండండి....-:)...!!

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

మనసుని మర్చి పొతే ఏ గోలా ఉండదు.... మనం సంతోషంగా ఉండాలి అంటే ముందు మనసుని మర్చి పోవాలి .... ఇక అందరు ఆ పనిలో ఉండండి...
చిన్న చిట్కా (కాకపోతే మనసులోంచే వచ్చింది .... మాయ మనసు)
మీ మనసు మాటల్లో పరిత్యాగాన్ని చూస్తున్నాను.
అభినందనలు మంజు గారు!

Mahesh చెప్పారు...

I am a big fan of your post's...matalu ravadam ledu andi chepadaniniki mee post la gurinchi...super...ela rasthunaro ardam kavadam ledu andi...mee post lu chusthunte meru life ni ala ela chudagaluguthunro teliyadam ledu...your posts are so much realistic and real life senario's...Salute Madam....

Mahesh చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు మహేష్ గారు మీ అభిమానానికి

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు మీ అభిమానానికి చంద్ర గారు

Unknown చెప్పారు...

పరధ్యానం నుంచి మొదటి రెండు అక్షరాలు తీసేస్తే బాధలు, ఆవేశాలు, కోపాలు, కష్టాలు, కన్నీళ్ళు... అన్నింటిని జయించొచ్చు...

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు విజయ్ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner