నువ్వు వినే ఉంటావు ఈ నానుడి " పరోపకారార్ధం ఇదం శరీరం " .... ఒకప్పుడు పరుల కోసమే ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఎందరో ధన్య జీవులు చరిత్ర పుటల్లో... ఆ చరిత్ర పుటల్లో మనకు స్థానం కావాలనుకుంటే ముందు ఇంట్లో చక్కదిద్దుకోవాలి... మరొక సామెత గుర్తు వస్తోంది ఈ మాటకు ... " ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత " .. అన్నట్టు ఇంట్లో వాళ్ళను కనీసం తిన్నారా అని అడిగే సమయం ఉండదు కాని అక్కయ్యల్ని, బావయ్యల్ని, మామయ్యల్ని .... ఇలా ప్రతి ఒక్కరి క్షేమ సమాచారాలను అతి గౌరవంగా అడిగి తెలుసుకునే ప్రబుద్దులు ఈనాడు ఎందరో... మన అనుకున్న వాళ్ళను... మన ఉన్నతికి చేదోడైన వాళ్ళను పక్కన పెట్టి అన్యులను అందలాలు ఎక్కించే వాళ్ళను ఏ కోవలో చేర్చాలో... ఇంట్లో కనీసావసరాలు చూడలేరు కాని దీన జనోద్దరణకు బయలుదేరుతారు ఈ రాజారామ్మోహన రాయలు, కందుకూరి వీరేశలింగాలు... (మన్నించాలి పెద్దలు వారి పేర్లు వాడినందుకు ).. ఇంట్లో పెళ్లాన్నో / అమ్మనో కనీసం తిన్నావా అని అడిగే సమయం లేని ఈ పెద్ద మనుష్యులు చెప్పే శ్రీరంగ నీతులు వినడానికే అసహ్యంగా అనిపిస్తాయి... అన్నట్టు ఈ శ్రీరంగ నీతులు అంటే గుర్తు వచ్చింది మరో విషయం... ఉదయకిరణ్ గుర్తు వస్తే వెంటనే నాకు గుర్తు వచ్చే వ్యక్తి మాజి మంత్రివర్యులు చిరంజీ గారు...
పరోపకారానికి నాడు చరిత్ర కెక్కి ఈనాటికి సజీవంగా మిగిలిపోయిన శిభి చక్రవర్తి, కర్ణుడు వంటి మహానుభావులు కోకొల్లలు... కాని ఈనాడు చరిత్ర హినులే ఎక్కువగా చరిత్ర పుటల్లో మిగిలి పోతున్నారు.. ఎందుకీ వ్యత్యాసం నేస్తం... !!
అర్ధం కాని అయోమయంలో ...
నీ నెచ్చెలి
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
ఎంద చాట. మధ్యలో చిరంజీవి మీద అక్కసు ఎందుకో?
nijam kadaa anduke :)godaavari pushkaraala samghatanapai chiranjivi gari spandana chusi
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి