6, ఆగస్టు 2026, గురువారం

రాచబాట..!!


మాట మనసులో

దాగుంది

శూన్యంతో సహవాసం 

మెుదలయ్యింది


కోపాల శాపం

వెంటబడింది

ఆశల దీపం

హారతయ్యింది


దిగులు గుబులు

చుట్టేసింది

బతుకు బరువు

భారమయ్యింది


ఓటమి పాఠం

నేర్పింది

గెలుపు గమ్యం 

గమనమయ్యింది


రాదారి నడక

అలవాటైంది

రాచబాట వెదుకులాట

వరమయ్యింది..!!








0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner