12, ఆగస్టు 2026, బుధవారం

ఏదో వొకటి..!!


మనిషితో 

సహవాసం

చేయాలంటే

మనీ కావాలి


మనసుతో

కలవాలంటే

ఆరాధనో

ఆత్మీయతో కలగాలి


బతుకులో

కలిసి నడవాలంటే

బంధమో

బాధ్యతో వుండాలి 


కాలం

కలిసిరావాలంటే

కలలు

రాలిపోకుండా నిలవాలి


ఏ నైపుణ్యాలున్నా

ఎదగడానికో దారి

ఏర్పడాలంటే

నేర్పరితనముండాలి..!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner