మన మధ్యకు ఎప్పుడెప్పుడు వచ్చి
వాలదామా అని...!!
అయినా దానికెందుకో అంత తొందర
చోటివ్వక పోయినా చేరువగా చేరాలని
ఎలా చూస్తోందో చూడు...!!
నేనే ఉన్నాను అనుకుంటోందో ఏమో
వచ్చి వాలిపోవడానికి ఏ అడ్డంకి
లేదని సంబరపడుతూ...!!
నువ్వు లేకపోయినా నీ జ్ఞాపకాలు
నాతోనే ఉన్నాయని మన మధ్య చోటే లేదని
దానికేం తెలుసు పాపం...!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
"ఆశ ఆ నిశ్శబ్దానికి .... నీకూ నాకూ మధ్యకు రావాలని, చేరువవ్వాలని, దూరిపోవాలని
నువ్వు లేకపోయినా .... నీ జ్ఞాపకాలకూ నాకూ మధ్య చోటు లేదని తెలియకే"
రెండు మనసుల మధ్య గాలి కూడా దూరలేని అన్యోన్నతను కవిత లో చక్కగా ఇమడ్చారు.
అభినందనలు మంజు యనమదల గారు!
Manju gaaru.. Very niccce.. chaalaa andangaa undi mee kavitha...
papam mounam paristhithi entandi..???:-):-):-)
ధన్యవాదాలు ఎగిసే అలల కార్తిక్ గారు , మౌనం మౌనంగానే ఎదురు చూస్తూనే ఉంది ఎప్పుడెప్పుడు చోటు దొరుకుతుందా అని
కవితలోని మొత్తం సారాన్ని చెప్పిన మీ ఆత్మీయ స్పందనకు వందనాలు చంద్ర గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి