ఈ మహోజ్వలనంలో పుట్టిన అక్షర శులాలు చాలా మంది గుండెలను గుచ్చుతున్నాయి...గెలిపించే ఆయుధాన్ని అందుకుని మనిషిలోని శత్రువులను, మిత్రులను మనసు విజయానికి అలంకారాలుగా చేసి అమ్మ అమృతాన్ని చవి చూపించి మాత్రుత్వపు మమకారాన్ని అద్భుత వరంగా ఆవిష్కరించి, తనలోని మనసు మాటలను, భావ జాలాలను, భేషజాలు లేని నిష్కల్మష నిర్మల హృదయాన్ని పరచి, తన భావాల ఆశలతో మనలను మాటలాడించి నేను నాలానే ఇలానే ఉంటాను అంటూ గెలుపు పిలుపు బావుటాను ఎగురవేస్తాను నా మాటలే నా ఆయుధాలు అని చెప్తూ... తెలుగు రాజసాన్ని చక్కని తీయని తేనెల మాటల్లో చెప్పి... నాస్తికత్వంలో ఆస్తికత్వాన్ని చూసే అందమైన వ్యక్తిత్వం ముందు...ప్రేమలోని ఆర్తిని, ఆద్రతను కొత్త కోణంలో చూపి... మనిషి మనసు అశలనువివిధ రంగులలో చెప్పి .. మనసు నాటకాన్ని విశదికరిస్తూ... లోకపు పోక ళ్ళను, దేవుని మాయలను, సమాజపు వింత కట్టుబాట్లను ప్రశ్నిస్తూ... ఆత్మాభిమానాన్ని అమ్ముకోవద్దని తన ఇస్టాన్ని నిక్కచ్చిగా చెప్పిన అభి ధైర్యం అభినందించదగినది...!!
ఆక్రోశంలో రగిలే ఆవేశం పొంగులెత్తి దేవుణ్ణి కూడా ధిక్కరించి మనసు మాయను చూపించి నిజాల నిప్పులతో ఆటలాడి విజయాన్ని చవి చూడమని చెప్తూ...అప్పుడప్పుడు తన లోకంలోకి వెళిపోతూ తన అభిమాన ధనాన్ని చూపిస్తూ మనిషి అర్ధాన్ని మార్చవద్దని అడుగుతూ... ఆడపిల్లను ఆడ పిల్లగా చూడవద్దని వేదనను వెళ్లగక్కుతూ... పెద్దరికాల లోపాలను చూపిస్తూ... నిదురను దూరం చేసి అలుపెరుగని అద్భుతాన్ని అందుకోమంటూ... నిజమైన దేవుని నమ్మిన పనిలో చూడమని చెప్పిన.... ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో భావాలు కనిపిస్తాయి ప్రతి కవితలోనూ...
ప్రకృతి అందాలను, ప్రేమ పార్శ్వాలను తన మనసుతో చూసి.. తన ముక్కుసూటి తనాన్ని, ఆత్మాభిమానాన్ని, పొగరుని, వగరుని తలెత్తుకుని గర్వంగా చెప్తూ నేను ఇలానే ఉంటాను అనే అభి నమ్మిన దాన్ని ఎవరేమనుకున్నా నాకేంటి అంటూ నిర్భయంగా తను నమ్మిన నిజాల్ని చెప్పే అభి ముందు ముందు మరిన్ని మహా జ్వాలలు పుస్తకాలుగా ఆవిష్కరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ .....
ప్రేమతో
మంజు అక్క
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చాలా బాగా రాశారు మంజు గారు ,really supeeb
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి