11, డిసెంబర్ 2013, బుధవారం

సేద దీరినవెందుకో...!!

మనసు మౌన కావ్యమైన తరుణాన
చెప్పలేని బతుకు అర్ధాలు మూగబోతే
పలుకలేని భావాలను తెలుపలేక
చిన్న బోయిన మోము...చాటున దాగుంది...!!

కలలకర్ధం కంటికి తెలిసినా తెలుపలేని భాష
కన్నీటికి దొరికినా ఆ భావనల ఒరవడిని
తట్టుకునే తనువు తనదైనా తనది కాని
మదిని సముదాయించలేని వృధా ప్రయత్నం ఇది ...!!

పొదరింటి పయనం పొడ గిట్టని ప్రయాణమై
మాటల శరాలు శతఘ్నులై పహారా కాస్తుంటే
జ్వాలలై ఎగసి పడుతున్న అంతరాగ్ని కాల్చేస్తోంది
తనువును సమిధలు లేకుండానే...!!

అందుకోలేని అగ్ని పుష్పమై అలరాలినా
అందని అంబరమై ఆశలు రేపెట్టినా
అలరులు కురిసిన ఆనందానికి ఆలవాలమైనా
అశ్రు ధారలు ఆ నయన తారకల చెంతన సేద దీరినవెందుకో...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

మనసు మౌన కావ్యమై చిన్న బోయి, భాష లేని కన్నీటితో మదిని సముదాయించలేక, మాటల శరాలు శతఘ్నుల పహారా లో
జ్వాలలై ఎగసి పడుతున్న అంతరాగ్ని కాల్చేస్తూ, అగ్ని పుష్పమై అలరారి ఆశలు రేపెట్టినా .... అలరులు కురిసిన ఆనందానికి ఆలవాలమైనా అశ్రు ధారలు ఆ నయన తారకల చెంతన సేద దీరినవెందుకో....
ఎంతో లోతైన భావనలు ఆలోచింప చేస్తూ ఎందుకో ఆ ఉద్వేగభరిత పదాల్ని, ఆ స్పష్టతను చదువుతూ అభినందించాలనిపిస్తుంది. మంజుగారు శుభసాయంత్రం!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు మీ ఆత్మీయ స్పందనకు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner