నెలవంక నీడ అగుపించినాది
మాటేసిన మబ్బులు దాచేసినాయి
సీకట్ల పరదాలు చుట్టేసినాయి
రాదారులన్ని బోసి పోయినాయి
సిరునవ్వుల ఎలుగులేక చింత పడే మనసుతో
గుండె గూడు గుబులై చిన్న బోయినాది
సుక్కల సీరల్లో దాగినాదేమో
మబ్బుల పానుపుల్లో పరున్నదేమో
కలై తోడుగా కడవరకు నడిచింది
మాటగా మదిలో సడి లేకుండా దాగుంది
గురుతులిడిసి పోనాది గుప్పిలి నిండుగా
తెరచిన సేతుల్లో జ్ఞాపకమై మిగిలింది
ఎటెల్లిపోనాదో ఏ తావుల సేరిందో..!!
యాడని ఎతికేది...ఎతికి ఎతికి ఏసారిన ఈ తనువు...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
సిరునవ్వుల ఎలుగులేక చింత పడే మనసుతో
గుండె గూడు గుబులై చిన్న బోయినాది
.........
గురుతులిడిసి పోనాది గుప్పిలి నిండుగా
తెరచిన సేతుల్లో జ్ఞాపకమై మిగిలింది
"ఏ తావుల సేరిందో..!!" కవిత లో ఇంతకు ముందు చూడని అందమేదో చూస్తున్నట్లనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చదివించింది. చాలా బాగుంది విడమర్చలేక పోతున్నాను. అభినందనలు మంజు గారు!
ధన్యవాదాలు చంద్ర గారు మీ ఆత్మీయ స్పందనకు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి