19, డిసెంబర్ 2013, గురువారం

మనసు కావ్యం ....!!

చెప్పని కధకు సాక్ష్యం ఎక్కడని వెదకను
మిగిలిపోయిన జ్ఞాపకాల నీడలను అడిగితే...!!

ఎలా చెప్పాలో తెలియక నన్ను చూస్తూ
మాటలు రాక మౌనంగానే ఉంటాయేమో నీలానే...!!

జారిపోతున్న పరదా చాటున ఓ ఛాయ
కనిపించి కనిపించక దాగుడుమూతలాట నాతో నువ్వేనేమో..!!

ఇలా వచ్చి అలా వెళ్ళే ఆ గాలి స్పర్శ
నీ తలపుల బంధనాల చిక్కుల్లో చుట్టినా ఆనందమే నాకు..!!

మనసు పరచి మమత పంచిన బంధం
చేరువ కాలేక దూరం పోలేక నలిగి పోతున్న క్షణాలు మన మధ్య...!!

కన్నీటి కావ్యాన్ని చెరిపేసిన చెలిమి చెప్పకనే
చెంతనే ఉండి చేరువగా చేరితే ఆ సాన్నిహిత్యం అందమైన ప్రేమ కవనమే....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

"ఎలా చెప్పాలో తెలియక నన్ను చూస్తూ
మాటలు రాక మౌనంగానే ఉంటాయేమో నీలానే ...." మౌన ఆరాదనల మనోభావనలు అలాగే ఉంటాయి
బాగుంది
అభినందనలు మంజు గారు! శుభోదయం!!

చెప్పాలంటే...... చెప్పారు...

మీ ఆత్మీయ స్పందనకు వందనాలు చంద్ర గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner