దిగంతాల ఆవలకు పోయినా వెన్నంటి వస్తున్నావు....!!
రహదారులన్ని మూసేశాను నువ్వు రాకుండా
అయినా వదలకుండా వెంట పడుతూనే ఉన్నావు...!!
నీకు తెలియకుండా నాతోనే నడుస్తున్నావు
నా అడుగుల ముద్రలలో నీ పాదాల గుర్తులతో...!!
నీ తలపు గుండె గూటిలో కొలువై నాతోనే నిరంతరం
మనసుని మూసే తలుపు లేక తెరిచే ఉంచా నీ కోసం...!!
చేరువుగా లేకున్నా చెంతనే ఉండకున్నా
నాలోని నీతోనే నా అక్షరయానం ఎప్పటికి...!!
నీ ఆనవాలు ఒక్కటి చాలదూ నాలో
నీ జ్ఞాపకాల సాహచర్యంతో జీవితాంతం బతకడానికి...!!
2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
నీ నుండి దూరంగా పారిపోయాను అనుకున్నా దిగంతాల ఆవలకు పోయినా వెన్నంటి వస్తున్నావు.... రహదారులన్ని మూసేసినా నాతోనే నడుస్తున్నావు. నీ ఆనవాలు ఒక్కటి చాలదూ నాలో నీ జ్ఞాపకాల సాహచర్యంతో జీవితాంతం బతకడానికి....
ఎవరమూ ఎవరిని వదిలి ఎంత దూరమో పారిపోలేము. ఒక జీవితకాలము తప్పని సహజీవనమే ప్రాకృతికము.
అద్భుతభావనల తో కవిత చాలా బాగుంది.
అభినందనలు మంజు గారు!
మీ ఆత్మీయ అభిమానానికి నా వందనాలు చంద్ర గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి