23, డిసెంబర్ 2013, సోమవారం

నువ్వు నెగ్గిన ఆ క్షణం...!!

జ్ఞాపకంగా దాచేసుకుందామంటే
గతంగానే ఉండి పోతానంటున్నావు...!!
కరిగి పోయిన కాలంలో కలగా
మిగిలి చెప్పని కధగా మారిపోయావు...!!
పలకరింపుల పలవరింత మౌనంగా ఉంటే
దొరికి పోయిన నీ మది దాగిపోయింది సిగ్గుపడుతూ ...!!
నువ్వు నీకు తెలిసిపోయిన ఆ క్షణాలు
నాతో స్నేహం చేసాయి నిన్ను పరిచయం చేస్తూ...!!
వెన్నెలా వేకువలు కలిసినట్లు
శిశిర వసంతాలు చెంతనే చేరినట్లుగా బావుంది కదూ...!!
నాకు తెలియని నా జ్ఞాపకం నీలో ఉండి
ప్రపంచాన్ని జల్లెడ పట్టిన వెదుకులాటలో నువ్వు నెగ్గిన ఆ క్షణం...!!
చేజారిన చెలిమి చెంతకు చేరిన తరుణం
పుడమిని తాకిన తొలకరి చినుకుల సంబరాన్ని గుర్తు చేస్తూ...!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

జ్ఞాపకంగా దాచేసుకోలేని గతంగానే ఉండి పోయి, కరిగి పోయిన కాలంలో కలవై .... చేజారిన చెలిమి చెంతకు చేరిన తరుణం
పుడమిని తాకిన తొలకరి చినుకుల సంబరాన్ని గుర్తు చేస్తూ .... అని రాసిన కవిత "నువ్వు నెగ్గిన ఆ క్షణం" చాలా బాగుంది.
అభినందనలు మంజు గారు!

చెప్పాలంటే...... చెప్పారు...

మీ ఆత్మీయ అభిమానానికి నా వందనాలు చంద్ర గారు

vemulachandra చెప్పారు...

జ్ఞాపకంగా దాచేసుకోలేని గతం
కలగా మిగిలిన కథ
ఒకనాడు
సిగ్గు వరమైన స్నేహం ....
ఎంతో బావుంది
బహు చక్కని భావుకత్వం
చాలా బాగా రాసారు
అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner