కనుల ఎదుట నీవుంటే కవితల్ల నా తరమామనసు నిండ నీవుంటే మరపు నా వశమా
మౌనంగా నీవుంటే మౌన కావ్యాలు నా కవనాలా
చెంతనున్న నీ తలపే విడలేని బంధమాయనా
మాటలన్ని నీవైతే అక్షరాలు నాకందేనా
ఊహలన్ని నీవైతే ఊసులన్ని నావేనుగా
మువ్వల సవ్వడి నాదైతే ముగ్ధత్వం నీదేనుగా
సరాగాలు నీవైతే కోయిల రాగాలు నావేనుగా
గోధూళి సంబరం నాదైతే పండు వెన్నెల నీదేనుగా
జ్ఞాపకాలు చెంతనుంటే గతమంతా నీవేనుగా
వెదుకులాటల వెతలలో అలసిన ఆనందం నీ చెంతకు చేరగా...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
మనసు నిండ నీవు .... మరపు నా వశమా!
మౌనంగా నీవు .... మరి మౌన కావ్యాలు నా కవనాలా!
కవిత చిన్నదే అయినా ఎంతో అర్ధం మర్మగర్భమై ఉంది. మనోభినందనలు మంజు గారు! శుభోదయం!!
మీ ఆత్మీయ స్పందనకు వందనాలు చంద్ర గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి