8, డిసెంబర్ 2013, ఆదివారం

మనకి మనమే మిగిలేది....!!

నేను ముసుగు వేసుకున్నా
నా అంతరంగానికి తెలియకుండా...
ఎవరికీ కనిపించలేదేమో అనుకుంటూ
పారిపోవాలని పరుగెడుతూనే ఉన్నా...
అలసి పోయి ఎప్పటికో ఆగిపొయాను
వేసుకున్న ముసుగు తొలగి వెలుగు గుచ్చుకుంది
చూడలేక అడ్డుగా చేతులు పెట్టుకున్నా
నేనెక్కడ ఉన్నానో తెలియక....
నాకు తెలియకుండానే
దిగంతాల అంచులకి చేరుకున్నా అప్పటికే... 
నా చుట్టూ శున్యమే తోడుగా ఉంది
ఒంటరి పయనంలో మనసుకు కప్పిన దుప్పటి
చిరిగి పోయింది...అ చిరుగులకు అర్ధం
వీడిన చీకట్లు విన్నవించాయి....
బంధాలు...భాద్యతలు...ప్రేమలు..అభిమానాలు
అన్ని జగన్నాటకంలో మొహాలు...
ఈ బతుకు పయనంలో...
మన రాక ఒంటరే..పోక ఒంటరే..
చివరికి మనకి మనమే మిగిలేది....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vemulachandra చెప్పారు...

ముసుగు లో నా అంతరంగానికి తెలియకుండా .... పారిపోవాలని పరుగెడుతూ, నేను .... అలసి ఆగిపొయాను. నేనెక్కడున్నానో నాకే తెలియదు. దిగంతాల అంచుల్లా .... చుట్టూ శున్యంలా .... ఒంటరి పయనం .... వీడిన చీకట్లు .... మోహాలు ....
ఈ బంధాలు .... భాద్యతలు .... ప్రేమలు .... అభిమానాలు
బతుకు పయనంలో.... చివరికి మనకి మనమే కదా మిగిలేది!?
అంతరంగ మధనం, వేదాంత దోరణి .... చాలా స్పష్టంగా వాస్తవానికి అక్షర రూపం లా చాలా బాగా రాసారు.
అభినందనలు మంజు గారు! శుభోదయం!!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చంద్ర గారు .. మీ అభిమాన స్పందనకు వందనాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner