గుణ సినిమా లోని
వెన్నెలకంటి గారు రాసిన ఈ పాటని ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు శైలజ మాట్లాడుతూ పాడిన మధురగీతం. నాకు చాలా చాలా నచ్చిన పాటల్లో ఇది ఒకటి. కమల్ నటన చెప్పడానికి మాటలు చాలవు. అమాయకమైన మాటలతో ప్రేమను ప్రియురాలికి చెప్పే విధానం అందరికి ఎంతో నచ్చుతుంది....
మీ కోసం విడియో లింక్ ఇక్కడ
http://www.youtube.com/watch?v=x7pFz4E8Vsoఅబ్బాయి : రాయి
అమ్మాయి : ఏం రాయాలి
అబ్బాయి : లెటర్
అమ్మాయి : ఎవరికీ
అబ్బాయి : నీకు
అమ్మాయి : నాకా..?
అబ్బాయి : ఊ..
అబ్బాయి : నాకు వ్రాయటం రాదూ, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా..
అమ్మాయి : వెయిట్, వెయిట్.....
అమ్మాయి : నాకు నువ్వు రాసే ఉత్తరం, నేను రాసి...
అబ్బాయి : నాకు చదివి వినిపించి తరువాత నువ్వు.. చదువుకో
అమ్మాయి : ఐ లైక్ ఇట్ ..ఊ.. చెప్పు
అమ్మాయి : ఊ....
అబ్బాయి: ఆఆ..
అబ్బాయి : నా ప్రియా...ప్రేమతో.. నీకు
అమ్మాయి : నీకు
అబ్బాయి: నే..
అమ్మాయి : రాసే..
అబ్బాయి : నేను
అమ్మాయి : ఊ....
అబ్బాయి : రాసే
అమ్మాయి : ఉత్తరం.
అబ్బాయి: ఉత్తరం..లెటర్..చ...లేక..ఊ... కాదు..ఉత్తరమే అని రాయి
అమ్మాయి : ఊ..అదీ
అబ్బాయి : చదువు..
అమ్మాయి : కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
అబ్బాయి : పాటలో మర్చి రాసావా..అప్పుడు నేను కూడా మారుస్తా..
అబ్బాయి : మొదట నా ప్రియా అన్నాను కదా , అక్కడ ప్రియతమా అని మార్చుకో..
అబ్బాయి: ప్రియతమా నీవింట్లో క్షేమేమా.. నేను ఇక్కడ క్షేమం
అమ్మాయి: ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
అబ్బాయి : ఆహా....ఒహో.. నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది
అబ్బాయి : కానీ అదంతా రాయాలని కూర్చుంటే, అక్షరాలే..మాటలే...!
అమ్మాయి: ఉహలన్ని పాటలే కనుల తోటలో..
అబ్బాయి : అదీ...
అమ్మాయి : తొలి కలల కవితలే మాట మాటలో....
అబ్బాయి : అదీ...ఆహా..భ్రమ్మాండం...కవిత..కవిత..ఊ...పాడు...
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఉహలన్ని పాటలే కనుల తోటలో..
తొలి కలల కవితలే మాట మాటలో....
ఓ హో...
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
లాల ల ల ల లా ల ల...
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
లాల ల ల ల లా ల ల...
అబ్బాయి: ఊ...
అబ్బాయి : నాకు తగలిన గాయం అదీ చల్లగా మానిపోతుంది..
అబ్బాయి : అదేమిటో నాకు తెలీదు, ఏమి మాయో తెలీదు నాకు ఏమి కధసలు..
అబ్బాయి : ఇది కూడా రాసుకో...
అబ్బాయి : అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ అలాంటివి వేసుకోవాలి ఆ......
అబ్బాయి : ఇదిగో చూడు నాకు ఏ గాయం అయ్యినప్పటికి ఒళ్ళు తట్టుకుంటుంది
అబ్బాయి : నీ వొళ్ళు తట్టు
కుంటుందా..?
అబ్బాయి : ఉమా దేవి....దేవి ఉమా దేవి...
అమ్మాయి : అది కూడా ర్యాల..?
అబ్బాయి : ఆహా..హా....
అబ్బాయి : అది ప్రేమా....
అబ్బాయి : నా ప్రేమ ఎలా చెప్పాలో తెలీక ఇదవుతుంటే
అబ్బాయి :ఏడుపు వస్తోంది...
అబ్బాయి : కానీ నేను ఏడ్చి.. నా శోకం నిన్ను కూడా బాధ పెడుతుంది అనుకున్నపుడు
అబ్బాయి : వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది.
అబ్బాయి : మనుషులు అర్ధం చేసుకునేందుకు ఇది మాములు ప్రేమ కాదు..
అబ్బాయి : అగ్ని లాగ స్వచ్చమైనది...
గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే,
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే.....
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు,
పువ్వు సోకి నీ సోకు కన్దేనే...
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధార లోన కరుగుతున్నది....
నాడు సోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది...
మనుషులేరుగా లేరు,
మామూలు ప్రేమ కాదు,
అగ్ని కంటే స్వచ్చమైనది...
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...
ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా..
సుభ లాలీ లాలి జో
లాలి లాలి జో...
ఉమా దేవి లాలి జో..
లాలీ లాలి జో
మమకారమే....ఈ లాలి పాట గా
రాసేది హృదయమా....
నా హృదయమా.....