సమస్త పెజానీకానికి,
ఈమధ్య అన్నదమ్ముళ్ళందరికి కాస్త ఎటకారాలెక్కువయ్యాయి. మన గోడ మీద మనం పోస్ట్లెట్టుకున్నప్పుడు లేదేటి. మనం ఒకటంటే ఎదుటోడు 100 అంటాడు. ఎవరి లెక్కలెవరికి తెలియదు కనుక. మీ గోడల మీద మీర్రాసుకున్నప్పుడు నేనేమయినా మీ అభిప్రాయాన్ని తప్పుబట్టానా... లేదే. నా రాతలు నా గోడ మీద రాసుకుంటే మరెందుకంత బాధ. పోని నేనేమయినా చాటభారతాల తిట్లేమయినా తిట్టానా. అయ్యెారామ మీరు పదే పదే నొక్కి వక్కాణించిన మాటని...రెండు ముక్కల్లో అడిగితేనే తట్టుకోలేక పోతున్నారు.
" అవినీతి రహిత ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడే పాస్‌పోర్ట్ ఎంక్వైరికి వచ్చిన పోలీసాయనకు ఇచ్చిన అక్షరాలా 500 రూపాయలు. "
ఈ మాట రాసినందుకే ఎన్ని బిరుదులో నాకు... నా బాధో, సంతోషమెా నేను రాసుకున్నాను. మీకు ఆ స్వేచ్ఛ ఉందిగా... మీ గోడ మీద రాసుకోండి. అంతేకాని అప్పుడిలా జరిగింది మీరెందుకు రాయలేదు, మీకు కులగజ్జి అదీ ఇది అని అనడంలోనే మీరెంత సంస్కారవంతులో తెలుస్తోంది. పోస్ట్ కు సంబంధించిన స్పందనలు కాకుండా మీ ఏడుపు వెళ్ళగక్కడానికి నా గోడ వాడుకోవద్దు. మీ గోడల మీద మీ ఏడుపు ఏడవండి. నాగురించి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాగితే...మర్యాదగా ఉండదు.
ఎటకారమంటూ మెుదలెడితే అసలు మూలమెలా ఉంటుందో చూపిస్తాను. పేర్ల పక్కన టాగ్ లు తగిలించుకుని ఎదుటివాళ్ళకి అదుందని, ఇదుందని అంటగడితే మనమే నవ్వులపాలైపోతాం.
నా రాతలు నచ్చని వారందరూ నిరభ్యంతరముగా వెళ్ళిపోవచ్చు...
ఏంటో రెండు ముక్కలు రాస్తేనే తట్టుకోలేనోళ్ళు...అసలు మూలాలుగా నుండి మెుదలెడితే ఏమైపోతారో ఏంటో.. 😊
1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి