30, నవంబర్ 2014, ఆదివారం
ఆ క్షణాలు....!!
అంతర్వేది సాహిత్యోత్సవంలో నా ఆనంద క్షణాలు మీ అందరితో పంచుకోవాలని.... చెప్పొద్దూ మొదటిసారి కదండీ భలే సంతోషంగా ఉంది అప్పుడు పెద్దల చేతుల మీదుగా అంతర్వేది కవితాపోటికి న్యాయనిర్ణేతగా ఉన్నందుకు ఇచ్చిన గౌరవం అది... అద్దేపల్లి రామమోహనరావు గారు, నూతక్కి రాఘవేంద్ర రావు గారు, మన అందరికి అత్యంత ఇష్టులు జానపద ప్రజా గాయకులూ వంగపండు గారు.... వారి చేతుల మీదుగా అందుకున్న ఆ క్షణాలు మరపురాని మధుర క్షణాలు...నా జీవితంలో... ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించిన సాహితీ సేవకు వేల వేల వందనాలు....
వర్గము
జ్ఞాపకాలు
29, నవంబర్ 2014, శనివారం
శిధిలాక్షరం...!!
విధి రాసిన రాతకు విటుల చేతిలో బొమ్మలా
అమ్మ పొత్తిళ్ళు తెలియని ఆకలి కేకల్లో
పాల బువ్వల ముద్దుల మురిపాలు
ముచ్చట తీర్చే ముసి వాయనాలుగా
రంగులు వెలసిన బతుకుల చాటున
కతల కన్నీళ్ళు జారుతూ వెక్కిరిస్తున్నా
గడియకో చిరునవ్వు పులుముకుని
ముళ్ళ పూలను అందంగా అమర్చుకుని
వసి వాడని కుసుమంలా ఆహ్వానం పలికే
ఆ రెప్పల మాటున కనిపించని వెతల గొంతులు
వినిపించే అపస్వరాలు అర్ధాంతరంగా
ముగిసే తరుణాల క్షణాల జీవితాలు
బంధనాల బంధాలు పంచుకోలేని
అపవ్యస్త భ్రమణాలుగా మిగిలిపోతూ
కన్నపేగు కదిలినా నమ్మకం మోసపోయినా
వ్యధశిలకు చేరిన వధ శిల్పమై నిలిచిన
రాయని బతుకు అక్షరం ఈ శిధిలాక్షరం...!!
అమ్మ పొత్తిళ్ళు తెలియని ఆకలి కేకల్లో
పాల బువ్వల ముద్దుల మురిపాలు
ముచ్చట తీర్చే ముసి వాయనాలుగా
రంగులు వెలసిన బతుకుల చాటున
కతల కన్నీళ్ళు జారుతూ వెక్కిరిస్తున్నా
గడియకో చిరునవ్వు పులుముకుని
ముళ్ళ పూలను అందంగా అమర్చుకుని
వసి వాడని కుసుమంలా ఆహ్వానం పలికే
ఆ రెప్పల మాటున కనిపించని వెతల గొంతులు
వినిపించే అపస్వరాలు అర్ధాంతరంగా
ముగిసే తరుణాల క్షణాల జీవితాలు
బంధనాల బంధాలు పంచుకోలేని
అపవ్యస్త భ్రమణాలుగా మిగిలిపోతూ
కన్నపేగు కదిలినా నమ్మకం మోసపోయినా
వ్యధశిలకు చేరిన వధ శిల్పమై నిలిచిన
రాయని బతుకు అక్షరం ఈ శిధిలాక్షరం...!!
28, నవంబర్ 2014, శుక్రవారం
మనఃపూర్వక కృతజ్ఞతలు.... !!
నేస్తం...
అక్షరాల వారధిగా నీతో పంచుకుని పెంచుకున్న అనుబంధం అలా అలా పెరిగి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎంత బావుందో... నాకు బాధ వేసినా.. సంతోషం వచ్చినా ముందుగా నీతోనే పంచుకోవాలి అనిపించేంత దగ్గరగా వచ్చేశావు ఈ కాస్త పరిచయంలోనే... గత జన్మ బంధం అంటే ఇదే కాబోలు... ఎందుకో అక్షరాలలోనే సంతోషాన్ని, విషాదాన్ని చూడటం పరిపాటిగా మారిపోయింది... జగమంత కుటుంబం నాదయినా నా ఏకాంతానికి నీ స్నేహమే ఆలంబనగా చేరింది... అమ్మలా అక్కున చేర్చుకున్నా... నాన్నలా ప్రేమాభిమానాలు పంచినా... ఆత్మీయ బంధంలా దగ్గరకు తీసినా ఇలా అన్ని బంధాలు నీలోనే వెల్లువలా పొంగితే వాటికి దాసోహం అనక తప్పలేదు.... నా ప్రతి మనసు స్పందన ముందుగా వినిపించింది నీకే...అందుకేనేమో ఇంతగా మమేకమైపోయావు నాలో నువ్వుగా... ఎన్నెన్ని జ్ఞాపకాలు, మరెన్నో ముచ్చట్లు, మనసు మాటలు, ఆరళ్ళ అగచాట్లు... ఇలా ఒకటేమిటి అన్ని... నీకు చెప్పని కబురు నా దగ్గర ఏం ఉంది కనుక.... ఒక్కోసారి నాకే అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అన్ని నీకే చెప్పేస్తూ ఉంటానా అని... సమాధానం దొరకకుండా పోయింది... అందరు అనుకుంటూ ఉంటారు స్తబ్దుగా ఉంది అని కాని వాళ్ళకు తెలియదు కదా నేను నీతో అన్ని చెప్పేస్తున్నా అని... మన పరిచయం మొదలై ఐదు వసంతాలు పూర్తి కావస్తున్నా తొమ్మిది వందల కబుర్ల సమీకరణాలు పంచుకున్నామని ఎంత మందికి తెలుసంటావు...?? ఇలా ఎన్నాళ్ళో ఈ అనుబంధం... నా ఊపిరి ఉన్నంత వరకు నీతోనే సాగనీ నేస్తమా.... నా ఈ తొమ్మిది వందల టపాలను ఓపికగా భరించి నాతో స్నేహాన్ని మరింత పెంచేసుకున్న నా నీకు కృతజ్ఞతలు.... -:) .
ఏంటి అర్ధం కాలేదా నా బ్లాగులో ఇది తొమ్మిది వందల పోస్ట్ .... మరి అందరు ఇంకా చూస్తున్నారేంటి అభినందించేయండి ..... నన్ను నా పోస్టులను భరిస్తున్న బ్లాగు మిత్రులకు.... ముఖ పుస్తక నేస్తాలకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు....
మీ నేస్తం...

కబుర్లు
ఎంత వెర్రి కోరికో...!!
ఆకలి కేకల ఆర్తనాదాలు నినదించే
ఆలిబిడ్డల జీవన్మరణాల రణాన్ని
ఆర్తిగా చూస్తూ బేలచూపుల బావుటాను ఎగురవేస్తున్నా...
ఆశల రెక్కల అంతఃకరణాన్ని అణగదొక్కి
ఆకాశానికి నిచ్చెనలేస్తూ అధఃపాతాళానికి పడిపోతూ
ఆనందాలను అందుకొనలేక విధాతను నిందిస్తూ
ఆయువు లెక్కలు తప్పులంటూ
ఆరిపోతున్న ప్రాణాలను సమిధలుగా మార్చుకుంటూ
ఆరని చితి మంటలను కాగడాలుగా చేసుకుంటూ
ఆత్మని అణగదొక్కి సోపానాల సింహాసనాలపై
ఆశీనమవ్వాలని ఎంత వెర్రి కోరికో ఈ మృగాలకు...!!

కవితలు
తెలుగు సాహితీ ముచ్చట్లు ...తొమ్మిదవ భాగం....!!
మన తెలుగు సాహితీ ముచ్చట్లు బోలెడు కబుర్లు, అలానే మధ్య మధ్యలో కొన్ని ఛందస్సుకు సంబంధించిన సమాచారాలతో... మూడు వృత్తాలు ఆరు అలంకారాలుగా సాగిపోతూ ఉంది... మాకు తొమ్మిదవ తరగతిలో తిరుమల తిరుపతి దేవస్థానము వారు ఒక పరీక్ష పెట్టారు... దానిలో పద్య భాగము, గద్య భాగము రెండు ఉన్నాయి... గద్య భాగము అంటే కథలే కనుక ఏదో ఒకటి రాయవచ్చునులే అనుకున్నా... మరి పద్య భాగం సంగతి..?? మా తెలుగు మాష్టారు రోజు మాకు క్లాసులు తీసుకునేవారు... ఉదయం తొమ్మిదికి లేదా సాయంత్రం ఐదుకు... నాకు ఉదయం కుదరక ఎప్పుడు ఉదయం పెట్టినా ఎగనామం పెట్టేదాన్ని...వెళ్ళినా వెళ్ళక పోయినా రోజు తిడుతూనే ఉండేవారు.... మా క్లాసులో అందరికి పండగే తెలుగు క్లాసు వచ్చిందంటే... నన్ను తిడుతుంటే వాళ్లకు సంతోషం... నేను నవ్వుతూనే ఉండేదాన్ని... ఆ పరీక్షకు ఇచ్చిన పద్య భాగంలో ఆ పద్యాలు చాలా వరకు వచ్చినవే... కథలు అన్ని తెలిసినవే... మాష్టారు ఎంత తిట్టినా పట్టించుకునేదాన్ని కాదు.... అటు ఇటు చేసి పరీక్షలు వచ్చేసాయి... నేను రాయడమే కాకుండా మా సీనియర్ కి కూడా చూపించాను... మొత్తానికి సముద్రాల జూనియర్ గారి సంతకంతో ప్రశంసా పత్రము కూడా వచ్చేసింది.... నన్ను మాష్టారు తిడుతున్నప్పుడే నాకు తెలుగు మీద బాగా ఇష్టం పెరిగి అది అలా అలా ఎక్కువై తెలుగంటే అత్యంత ప్రియంగా మారిపోయి ఈ తెలుగు సాహిత్యం కాస్త నేర్చుకోవడానికి సాయపడింది... ఇక మన సాహితీ ముచ్చట్ల విషయం లోనికి వస్తే ఈ వారం స్రగ్ధర, మహా స్రగ్ధర, గురించి మీతోపాటు నేను తెలుసుకుంటాను....
ఇది 21వ ఛందమైన ‘ప్రకృతి’లో 299393వ వృత్తము.
మహాస్రగ్ధర
కొలిచెం బ్రోత్సాహ వృత్తిం గుతల గగనము ల్గూడ రెం డంఘ్రులం దా బలిఁ బాతాళంబు చేరం బనిచె గడమకై బాపురే వామనుం డ స్ఖలితాటో పాఢ్యుఁ డంచుం గరిగిరివిరమాకారిమారన్సతానో జ్జ్వ లసోద్యద్రేఫయుగ్మాశ్రయ గురుల మహాస్రగ్ధరం జెప్ప నొప్పున్.
గణ విభజన
స్రగ్ధర
సంస్కృతంలో స్రగ్ధర చాలా గంభీరమైన వృత్తం. మయూరుడు అనే కవి కేవలం స్రగ్ధరావృత్తాలతో ‘సూర్యశతకం’ రాశాడు.
తెల్లంబై శైల విశ్రాంతిని మునియ తినిం దేజరిల్లు న్ధృఢంబై
చెల్లెం బెల్లై మకారాంచిత రభన యము ల్చెందమీద న్యకారం
బుల్లంబార న్బుధా రాధ్యు నురుగశ యను న్యోగివంద్యుం గడు న్రం
జిల్లంజేయం గవీంద్రు ల్జితదనుజ గురుం జెప్పెదర్ స్రగ్ధరాఖ్యన్.
ఈ విధమైన గమనంతో సూర్యశతకం మొత్తం స్రగ్ధరా వృత్తాలతో గంభీరంగా ఉంటుంది. ఆ ఛందస్సులోని గణాలకూర్పు కూడా అదే విధంగా ఉంటుంది. మ,ర,భ,య,న,న,య,య,య అనే గణాలు వరుసగా వస్తాయి. అన్నీ దీర్ఘాక్షరాలు, కొన్ని త్వరితగతిన ఆవృత్తమవుతాయి. దాని తరువాత హ్రస్వాక్షరాలు కొన్ని. ఈ విధమైన అమరిక ఒక విధమైన గాంభీర్యాన్ని సంతరించుకున్నట్లుగా ఉంటుంది. సంస్కృతంలోని స్తోత్రాలు అన్నీ సామాన్యంగా స్రగ్ధరలోనే ఉంటాయి.
గణ విభజన
UUU | UIU | UII | III | IUU | IUU | IUU |
మ | ర | భ | న | య | య | య |
తెల్లంబై | శైలవి | శ్రాంతిని | మునియ | తినిందే | జరిల్లు | న్ధృఢంబై |
లక్షణములు
ఇది 21వ ఛందమైన ‘ప్రకృతి’లో 299393వ వృత్తము.
గణములు : మ ర భ న య య య
యతులు 2 చోట్ల : 8వ అక్షరము, 15వ అక్షరము
ప్రాస నియమము కలదు.
• | పాదాలు: | నాలుగు |
• | అక్షరాలు ప్రతి పాదంలోనూ: 21 | |
• | ప్రతిపాదంలోని గణాలు: | మ, ర, భ, న ,య, య, య |
• | యతి : | ప్రతిపాదంలోనూ 8వ, 15వ అక్షరములు |
• | ప్రాస: | పాటించవలెను |
• | ప్రాస: యతి | ప్రాస యతి చెల్లదు |
ఉదాహరణ 1:
పోతన తెలుగు భాగవతంలో వాడిన స్రగ్ధర వృత్త పద్యాల సంఖ్య: 3
పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయ)/ప్రద్యుమ్న వివాహంబు|(భా-10.2-883-స్రగ్ద.)
కూలున్ గుఱ్ఱంబు లేనుంగులు ధరఁ గెడయుం గుప్పలై; నుగ్గునూచై
వ్రాలు న్దేరుల్ హతంబై వడిఁబడు సుభటవ్రాతముల్; శోణితంబుల్
గ్రోలున్, మాంసంబు నంజుం గొఱకు, నెముకల న్గుంపులై సోలుచు న్బే
తాల క్రవ్యాద భూతోత్కరములు; జతలై తాళముల్ దట్టియాడున్.
స్రగ్ధరా సౌందర్యం...!!

స్రగ్ధర. మౌళిస్రక్సంగ రంగ న్మధుకరపటలీ మానసా కృష్టి విద్యా
శాలి స్ఫారాబ్జరేఖాంజలి పుట ఘటనాచారు ఫాలస్థల క్ష్మా
పాలశ్రేణీ విశా లాంబక కుముదవనీ బాంధవాయత్తచంద్ర
శ్రీలీలాగాఢ కాంతి స్మితవదనరుచి స్ఫీతు నాగేంద్రకేతున్. (విరాట. 3. 78)
శాలి స్ఫారాబ్జరేఖాంజలి పుట ఘటనాచారు ఫాలస్థల క్ష్మా
పాలశ్రేణీ విశా లాంబక కుముదవనీ బాంధవాయత్తచంద్ర
శ్రీలీలాగాఢ కాంతి స్మితవదనరుచి స్ఫీతు నాగేంద్రకేతున్. (విరాట. 3. 78)
మహాస్రగ్ధర
కొలిచెం బ్రోత్సాహ వృత్తిం గుతల గగనము ల్గూడ రెం డంఘ్రులం దా బలిఁ బాతాళంబు చేరం బనిచె గడమకై బాపురే వామనుం డ స్ఖలితాటో పాఢ్యుఁ డంచుం గరిగిరివిరమాకారిమారన్సతానో జ్జ్వ లసోద్యద్రేఫయుగ్మాశ్రయ గురుల మహాస్రగ్ధరం జెప్ప నొప్పున్.
గణ విభజన
IIU | UUI | UUI | III | IIU | UIU | UIU | U |
స | త | త | న | స | ర | ర | గ |
కొలిచెం | బ్రోత్సాహ | వృత్తింగు | తలగ | గనము | ల్గూడరెం | డంఘ్రులం | దా |
లక్షణములు
• | పాదాలు: | నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు. |
• | అక్షరాలు ప్రతి పాదంలోనూ: 22 | |
• | ప్రతిపాదంలోని గణాలు: | భ, భ, భ, భ, భ, భ, భ , గ (7 భగణములు మరియు 1 గురువు) |
• | యతి : | ప్రతిపాదంలోనూ 9వ, 16వ వ అక్షరములు |
• | ప్రాస: | పాటించవలెను |
• | ప్రాస: యతి | చెల్లదు |
- 33 మాత్రలు ఉండును.
- మాత్రా శ్రేణి: I I U - U U I - U U I - I I I - I I U - U I U - U I U - U
ఉదాహరణ 1:
పోతన తెలుగు భాగవతంలో వాడిన మహాస్రగ్ధర వృత్త పద్యాల సంఖ్య: 2
పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయ)/బలరాముని తీర్థయాత్ర|భా 10.2-940-మస్ర.)
కనియెం దాలాంకుఁ డుద్యత్కట చటుల నట త్కాల దండాభ శూలున్
జన రక్తాసిక్త తాలు న్సమధిక సమరోత్సాహ లోలుం గఠోరా
శని తుల్యోదగ్ర దంష్ట్రా జనిత శిఖక ణాచ్ఛాది తాశాంతరాళున్
హనన వ్యాపార శీలు న్నతి దృఢ ఘన మస్తాస్థి మాలుం గరాళున్.

వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
వర్గము
సాహిత్యం
27, నవంబర్ 2014, గురువారం
మరు జన్మకు మళ్ళి రమ్మంది...!!
పొద్దు వాలి పోతావుంది
సందె సీకటి చుట్టేసింది
నల్ల మబ్బు కమ్మేసింది
సల్లగాలి శీత కన్నేసింది
మనసేమో మౌనమయ్యింది
మాటేమో మూగబోయింది
గుండెలో గుబులయ్యింది
చుక్కల పక్కేసింది
రేతిరేమో నిద్దరోయింది
వెన్నెల పక్కన చేరింది
జ్ఞాపకం తోడయ్యింది
నీ జతను కోరింది
చేరువకు రమ్మంది
చుట్టంలా చూసెల్లిపొమ్మంది
మరు జన్మకు మళ్ళి రమ్మంది...!!
సందె సీకటి చుట్టేసింది
నల్ల మబ్బు కమ్మేసింది
సల్లగాలి శీత కన్నేసింది
మనసేమో మౌనమయ్యింది
మాటేమో మూగబోయింది
గుండెలో గుబులయ్యింది
చుక్కల పక్కేసింది
రేతిరేమో నిద్దరోయింది
వెన్నెల పక్కన చేరింది
జ్ఞాపకం తోడయ్యింది
నీ జతను కోరింది
చేరువకు రమ్మంది
చుట్టంలా చూసెల్లిపొమ్మంది
మరు జన్మకు మళ్ళి రమ్మంది...!!
వర్గము
కవితలు
కోమలాంగి....!!
నయగారమొలికించు నీ మేని విరుపు నా మదిని నాట్య డోల లూగించెనే కోమలాంగి....!!
వర్గము
ఏక వాక్య కవిత
నాకు దిగులెందుకు చెప్పు నేస్తం....!!
నేస్తం....
ఏంటో చాలా రోజులు అయ్యింది మనం 'స్వ'గతాలుమాట్లాడుకుని... జీవితంలో మనం ఎవ్వరి గురించి పట్టించుకోకపోయినా మన గురించి పట్టించుకునే వాళ్ళు కొంతమందయినా ఉండటం ఓ రకంగా చాలా అదృష్టమనే చెప్పుకోవాలి... నేను నా బ్లాగులో రాయడం మొదలుపెట్టి ఐదు ఏళ్ళు గడచినా ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా ఓ మాట అన్నది లేదు... తప్పు ఉంటే మాత్రం తర తమ బేధం చూడలేదు... రాజకీయ పరంగా వ్యాసాలూ రాసి ఉండవచ్చు కాని.. ఎప్పుడు నా వ్యక్తిగతాన్నే రాసుకున్నా... ఎవరైనా అడిగితే వాళ్ళది నాది అనుకునే రాశాను సామాజిక పరంగా సమస్య ఉంటే... ఒక్కోసారి చిన్న మాటకు కూడా మనసులు మార్చుకునే మానవత్వం ఉంటుంది అని నాకు ప్రత్యక్షంగా తెలుసు... నా చిన్నప్పటి నుంచి ఈ రాయడం అన్నది నాలో భాగమై పోయింది... సంతోషమయినా, బాధయినా అక్షరాలతో పంచుకోవడం అలవాటుగా మారి ఇంజనీరింగ్లో మా సార్ తన మనసు మార్చుకోవడానికి కూడా ఈ అక్షరాలే కారణం అయ్యాయి... నేను మారడానికి కూడా ఈ రోజు ఇలా ఉండటానికి ఈ అక్షరాలే కారణం... పుస్తకాలు చదివినంత మాత్రాన జనాలు మారతారా ... వీళ్ళ పిచ్చి కాని అని అనుకుంటారు చాలా మంది... పిచ్చి కాదు వాస్తవం ఇది... అందుకు నేను, నా జీవితమే సాక్ష్యం... కాలు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు.. కాని కన్ను తడవకుండా సంసారాన్ని ఈదలేము అన్నది ఎంత నిజమో అందరికి తెలుసు... నేను ఎవరి స్వ విషయాల జోలికి వెళ్ళను... ఈ సంగతి నేను రాసిన నా తొమ్మిది వందలకు దగ్గరలో ఉన్న పోస్ట్స్ చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది... ఒకరు మనకి తెలుసు అని చెప్పడం వేరు వాళ్ళ సొంత విషయాలు వాళ్ళ పరోక్షంలో వేరే వాళ్ళతో చర్చించడం ఎంత వరకు న్యాయం...?? నా నేస్తాలయిన అందరికి నేనేంటో బాగా తెలుసు... సంసారం అన్నాక సవాలక్ష చిన్నా చితక సమస్యలు ఉంటాయి... లేకుండా ఒక్కరైనా ఉన్నారా నేస్తం... మనం అభిమానించే వారి దగ్గర మన విషయాలు చెప్పుకుంటే బావుంటుంది అంతే కాని ఫలానా వాళ్ళు ఇలా... అలా అని చెప్తే ఏం వస్తుంది... నాకు ఇది ఎప్పటికి అర్ధం కాని పెద్ద ప్రశ్నే...!! మన అవసరం కోసం ఎదుటివాళ్ళని పావులుగా వాడుకోవడమంత ఆత్మ ద్రోహం మరేది లేదు... రెండు చేతులు కలవనిదే చప్పట్లు రావు కదా... మంచి చెడుల బేరీజే చక్కని జీవితానికి పునాది... అమ్మో చాలా విషయాలు చెప్పేసాను ఈసారికి... ఎన్ని చెప్పినా భరించే నువ్వు నాకు తోడుగా ఉండగా నాకు దిగులెందుకు చెప్పు నేస్తం.... ఉండనా మరి ఇప్పటికి...
నీ ప్రియ నెచ్చెలి...

25, నవంబర్ 2014, మంగళవారం
నయగారపు సంకెళ్ళు...!!
గతమంతా గాయాల గురుతులైనా
బతుకంతా కన్నీటి పాటగా మారినా
ఛాయల చేదు తగులుతూనే ఉన్నా
మరల మరల పలకరించే ఆనవాలు నీ తలపే...
ఏకాంతానికి నే వెళ్ళినా నా వెన్నంటే
నీ అడుగుల సవ్వడి వినిపించినా
ఒంటరి కాని నా పయనం నీతోనే సాగినా
మరల మరల జతగా చేరినవి నీ జ్ఞాపకాలే...
ఓటమి నీడలో చీకటి చేరినా
వెన్నెల దాగని తీరపు తిమిరమే
చుక్కల దుప్పటి పరచిన వెలుగులే
మరల మరల కనిపించిన విజయ సంకేతాలే...
ప్రేమ రాహిత్యాన్ని అక్షర కావ్యాలుగా
సయ్యాటల సంపగి మొగ్గలుగా మార్చినా
దాయలేని కన్నీటి సంద్రాలను మోయలేక
మరల మరల నను చేరే నయగారపు సంకెళ్ళే...!!
బతుకంతా కన్నీటి పాటగా మారినా
ఛాయల చేదు తగులుతూనే ఉన్నా
మరల మరల పలకరించే ఆనవాలు నీ తలపే...
ఏకాంతానికి నే వెళ్ళినా నా వెన్నంటే
నీ అడుగుల సవ్వడి వినిపించినా
ఒంటరి కాని నా పయనం నీతోనే సాగినా
మరల మరల జతగా చేరినవి నీ జ్ఞాపకాలే...
ఓటమి నీడలో చీకటి చేరినా
వెన్నెల దాగని తీరపు తిమిరమే
చుక్కల దుప్పటి పరచిన వెలుగులే
మరల మరల కనిపించిన విజయ సంకేతాలే...
ప్రేమ రాహిత్యాన్ని అక్షర కావ్యాలుగా
సయ్యాటల సంపగి మొగ్గలుగా మార్చినా
దాయలేని కన్నీటి సంద్రాలను మోయలేక
మరల మరల నను చేరే నయగారపు సంకెళ్ళే...!!
24, నవంబర్ 2014, సోమవారం
శకలాలు చేసావు...!!
శస్త్ర చికిత్సకై నీ వద్దకు చేరిన మదిని మాటల శరాలతో శకలాలు చేసావు....
ఈ అక్షరమణికి నాకు ద్వితీయం వచ్చింది కృష్ణా తరంగాలు సమూహంలో.... నిర్వాహకులకు న్యాయ నిర్ణేతలకు కృతజ్ఞతలు
ఈ అక్షరమణికి నాకు ద్వితీయం వచ్చింది కృష్ణా తరంగాలు సమూహంలో.... నిర్వాహకులకు న్యాయ నిర్ణేతలకు కృతజ్ఞతలు
వర్గము
ఏక వాక్య కవిత
ఓ చక్కని జ్ఞాపకంగా....!!
నిన్నటి సాహితీ సంబరాల పండుగ తాకిన అంబరాల సంతోషాన్ని కాస్త నేను తీసుకుందామని అంతర్వేదికి
వెళ్ళానా.... నిజంగా కొంచమేంటి బోలెడు సంతోషాన్ని నా వెంట పెట్టుకుని తెచ్చేసుకున్నా... ఇప్పటి వరకు ముఖ పుస్తక పరిచయమే కాని ముఖా ముఖి తెలియని నేను... అక్కడికి వచ్చిన అందరు చిన్నా పెద్దా తేడా లేకుండా పలకరించిన ఆత్మీయ పలకరింపులకు ఏమిచ్చి వారి ఋణం తీర్చుకోగలను... ఇంతటి మహద్భాగ్యాన్ని అందించిన సాహితీ సేవకు శిరస్సు వంచి పాదాభి వందనాలు చెప్పడం తప్ప... చక్కని విందు భోజనాలు అంతకన్నా విలువైన సాహితీ విందుల ఆరగింపులు .. ఆ లక్ష్మినారశింహుని సన్నిధిలో.. వర్ణించడానికి మాటలు కూడా చాలని పరిస్థితి...
ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరించిన నిర్వాహకుల కృషి అభినందనీయం.... ఎక్కడా లోటు జరగకుండా అందరిని సంతోష సాగరంలో ఓలలాడించిన ఘనత కూడా వారిదే.... ముఖ్య అతిధుల చక్కని మాటలు... ఆట పాటలు అందరిని అలరించాయి.... కాస్త ఆలశ్యంగా మొదలైనా చివరి వరకు ఒక్కరు కూడా భోజన సమయం మించి పోయినా కదలలేదంటే... ఇంతకన్నా ఇంకేం చెప్పాలి.... ఓ మాట చెప్పనా మళ్ళి ఎవరితో అనకండేం... నన్ను సత్కరించారండోయ్ జ్ఞాపిక, శాలువా, పుష్పగుచ్చంతో.... నా ఇంతటి ఆనందానికి కారమైన ఈ సందర్భానికి చేరువగా నన్ను తీసుకు వెళ్ళిన మా కుటుంబ సభ్యులకు( అమ్మ, మా వారు, మా పిల్లలు) నా కృతజ్ఞతలు... నాకోసమే వచ్చిన నా అనుంగు సోదరికి ఆత్మీయ కృతజ్ఞతలు.... మరో మాట చెప్పనా చిన్నప్పుడు మనకు సినిమా వాళ్ళు కాని గొప్ప పేరున్న వాళ్ళు కాని ఎవరైనా అనుకోకుండా కనిపిస్తే గబా గబా ఫోటోలు దిగేస్తాము కదా ... అలానే ఆత్మీయులు నాతో తీయించుకున్న ప్రతి చిత్రానికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు... ఎందుకంటే అంతటి సంతోషాన్ని నాకు పంచినందుకు..... జీవితంలో ఓ చక్కని జ్ఞాపకంగా మిగిలిపోయింది నిన్నటి రోజు....

22, నవంబర్ 2014, శనివారం
నీకు ఏమి కాని బంధంలా....!!
ఎప్పుడో మరచిపోయిన బంధమా....
ఎన్నో ఏళ్ళు గడచిపోయాయి కదూ మన మధ్యన... చివరిసారి చూసిన జ్ఞాపకం కూడా సరిగా గుర్తు లేదు... అయినా ఎప్పుడు గుర్తు వస్తూనే ఉంటావు...నాకు తెలిసిన నీ ఇష్టం... నీకు తెలియని నా ఇష్టం ఎప్పటికి తెలియదేమో... తెలుసుకునే యత్నము నువ్వు చేయనేలేదు.. నీకసలే బోలెడు మొమాటామాయే.. మూడు పదులు దాటినా అప్పటి రోజులు ఇంకా గురుతులలోనే ఉన్నాయి సజీవంగా... కలవని బంధం మనది కాని జ్ఞాపకాల జీవితం తలచుకుంటే ఎంత హాయిగా ఉంటుంది ఇప్పటికి... అందుకేనేమో స్నేహంలోని కమ్మదనం రుచి చూసిన ఆ ఆనందం వదులుకోవాలనిపించనిది... మనసుల పరిణితి, మానసిక ప్రలోభాలు తెలియని ఆ స్నేహం ఎప్పటికి తీయనిదే.... అందరికి నేనంటే ఇష్టం... నాకేమో ఎందుకో నువ్వంటే బోలెడు ఇష్టం మరి... నీకేమో అది తెలియదు... అప్పటికీ ... ఇప్పటికీ ... ఎప్పటికీ... కాని చూసావా ఈ ఇష్టం ఉంటుందే అది మనసుని ఊరుకోనియదు చెప్పే వరకు ఇదే దానితో వచ్చిన పెద్ద చిక్కు... తెలియని నీకు ఎలా చెప్పేది చెప్పు.... కాస్తయినా గుర్తు ఉంటే పోనిలే మరికాస్త గుర్తుకుతెద్దాం అనుకోవచ్చు... అసలు గుర్తే లేని గజనివాయే :) ఇంకేం చేయను చప్పుడు చేయక స్తబ్దుగా ఉండిపోతున్నా... అబ్బా ఉండు ఏంటి ఈ గోల అంటావా ఏం చేస్తాం చెప్పు... అందరు కాదు కాని కొందరయినా ఇలా జ్ఞాపకాల పొరలను చీల్చి చూస్తూ ఉంటారని... నీలాంటి వాళ్ళకు ఎప్పటికి తెలుస్తుందో ఏమో.... ఆ... ఏం ఉందిలే ఈ జ్ఞాపకాలతో వేగడం నావల్ల కాదు అని వదిలేసి వాస్తవాన్ని తోడుగా చేసుకున్నా అని నువ్వు సరిపెట్టేసుకున్నా ... ఎందుకో నేనే సరిపెట్టుకోలేక దగ్గర లేని బంధాన్ని వదలలేక అంతః సముద్రంలో దాచి ఆ అలల తాకిడికి ఇలా అక్షరాల ఉరవడిలో కొట్టుకుపోతూ.... నీకు ఏమి కాని బంధంలా మిగిలి పోయాను...

నేనై పోయానేమిటి...!!
తారలద్దిన చీకటి దుప్పటి కాన్వాసుపై
నీ మనసు గీసిన తైలవర్ణ చిత్తరువు
చిత్రంగా నాదయ్యిందేమిటి...??
హద్దులన్ని పొద్దులుగా చేరి మాపటేలకు
రాతిరిని పోనియ్యని వెన్నెలగా మారి
నీ కలల రాదారిలో చిక్కుబడ్డాయెందుకు...??
రాలిపడిన అక్షరాలు చెప్పిన మౌనాలు
కారిన కన్నీటి చుక్కలు చెప్పిన జ్ఞాపకాలు
కలసిన నీ గతంలో నేనెందుకు ఉండిపోయాను...??
వాస్తవానికి చేరువకాలేని గాయమై నిను చేరి
నిశీధిలో వదలలేని వేకువ గీతమై నీలో ఉండిపోయి
నీలోనే దాగిపోయిన వెన్నెల జలపాతాన్ని నేనై పోయానేమిటి...!!

21, నవంబర్ 2014, శుక్రవారం
తెలుగు సాహితీ ముచ్చట్లు ...ఎనిమిదవ భాగం....!!
ఇప్పటి వరకు నాకు తెలిసిన వృత్తాల గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకున్న వివరాలు మీకు అందించాను... వృత్తాలు అంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మత్తకోకిల అనే నాకు తెలుసు... అంతర్జాలంలో వెదికితే మరికొన్ని వృత్తాల గురించిన వివరాలు దొరికాయి.... వాటిలో తరళము, తరలి, మాలిని కొత్తగా కనిపించిన వృత్తాలు... ఇవి కాక మరికొన్ని కూడా ఉన్నాయి.... వాటి గురించి మళ్ళి వారం చూద్దాము... దిగితే కాని లోతు తెలియదు... ఒడ్డున ఉండి రాళ్ళు వేసేవాడికేమి తెలుసు... అన్న సామెత ఎంత నిజమో ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది... సాహిత్యానికి ప్రాణాధారమైన భాషను గురించి నాకు తెలిసిన అది మా తెలుగు మాష్టారు చెప్పింది... నాకు బాగా ఇష్టమైన అమ్మ భాష గురించి నాలుగు ముక్కలు చెప్పేద్దామని గబ గబా మొదలెట్టేసానా... సముద్రంలో ఓపికగా వెదికిన కొద్ది మరకతమణులు, మాణిక్యాలు దొరికినట్లు ఈ సాహితీ ముచ్చట్ల కోసం వెదికిన వెదుకులాటల్లో ఎన్ని మణి మాణిక్యాలు మీతోపాటుగా నాకు దొరుకుతున్నాయో.... ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు అందించిన సాహితీ సేవకు వందనాలు.... ఇక ఈ వారం వృత్త వివరణలు చూద్దామా....
శివకరుండు హితోపదేశము సేయఁగాఁ గడువేడ్కతో
దివిజవంద్యుఁడు బ్రీతితోఁ జనుదెంచె నారదుఁ డంబుజో
ద్భవతనూజుఁడు భానుతేజుఁడు పాండవేయులపాలికిన్
సుతులు నై - చనుబాలు ద్రావుచు, జొక్కియాడుచు, గౌతుక
స్థితి జరింపగ, దల్లు లై విరసిల్లు గోవుల, గోపికా
సతులధన్యత, లెట్లు సెప్పగ జాలువాడ? గృపానిధీ!
పోతన భాగవతము - 10 - 569
చారుభసన భూరిజన రసాంద్రగణములన్ దిశా
సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్.
చారుభసన భూరిజన రసాంద్రగణములన్ దిశా
సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్.
లక్షణములు
భువనభర నివారీ! పుణ్యరాక్షానుసారీ!
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషసవర్తీ!
ధవళ బహుళ కీర్తీ! ధర్మ నిత్యానువర్తీ!
తరలి --------------భ-స-న-జ-న-ర-----యతి-11
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
తరలము
- ఇది మత్తకోకిలకి జంట వృత్తము
- మత్తకోకిలలో ని మొదటి గురువు తరలములో రెండు లఘువులుగా మారుతుంది.
లక్షణములు
- పాదాలు : నాలుగు
- ప్రతి పాదంలోని గణాలు : న భ ర స జ జ గ
- యతి : ప్రతిపాదంలోనూ 12 వ అక్షరము
- ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు
నడక
- మతత కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
- తనన తానన తాన తానన తాన తానన తాన తా
ఉదాహరణ 1
ప్రవిమలాగమతత్త్వవేది తపఃప్రభాసి జగత్త్రయీశివకరుండు హితోపదేశము సేయఁగాఁ గడువేడ్కతో
దివిజవంద్యుఁడు బ్రీతితోఁ జనుదెంచె నారదుఁ డంబుజో
ద్భవతనూజుఁడు భానుతేజుఁడు పాండవేయులపాలికిన్
ఉదాహరణ 2
క్రతుశతంబుల బూర్ణకుకుక్షివి కాని, నీవిటు క్రేపులున్సుతులు నై - చనుబాలు ద్రావుచు, జొక్కియాడుచు, గౌతుక
స్థితి జరింపగ, దల్లు లై విరసిల్లు గోవుల, గోపికా
సతులధన్యత, లెట్లు సెప్పగ జాలువాడ? గృపానిధీ!
పోతన భాగవతము - 10 - 569
తరలి పద్య లక్షణములు
- వృత్తం రకానికి చెందినది
- ధృతి ఛందమునకు చెందిన 97247 వ వృత్తము.
- 18 అక్షరములు ఉండును.
- 23 మాత్రలు ఉండును.
- మాత్రా శ్రేణి: U I I - I I U - I I I - I U I - I I I - U I U
- త్రిమాత్రా శ్రేణి: U I - I I I - U I - I I I - U I - I I I - U I - U
- చతుర్మాత్రా శ్రేణి: U I I - I I U - I I I I - U I I - I I U - I U
- పంచమాత్రా శ్రేణి: U I I I - I U I I - I I U I - I I I U - I U
- షణ్మాత్రా శ్రేణి: U I I I I - U I I I I - U I I I I - U I U
- మిశ్రగతి శ్రేణి (5-4) : U I I I - I U I - I I I U - I I I I - U I U
- 4 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
- ప్రతి పాదమునందు భ , స , న , జ , న , ర గణములుండును.
చారుభసన భూరిజన రసాంద్రగణములన్ దిశా
సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్.
చారుభసన భూరిజన రసాంద్రగణములన్ దిశా
సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్.
మాలిని
సాధారణంగా ఇది ఆశ్వాసాంత పద్యాలలో ఉపయోగిస్తారు.లక్షణములు
నడక
- ననన ననన నానా | నాననా నాన నానా
ఉదాహరణ 1
దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!భువనభర నివారీ! పుణ్యరాక్షానుసారీ!
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషసవర్తీ!
ధవళ బహుళ కీర్తీ! ధర్మ నిత్యానువర్తీ!
తరలి --------------భ-స-న-జ-న-ర-----యతి-11
తరలము(ధ్రువకోకిల)----న-భ-ర-స-జ-జ-గ----యతి-12
తరళము------------7నగణములు+గురువు----యతి-13
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
20, నవంబర్ 2014, గురువారం
నా దృష్టిలో గొప్ప కవితలు...!!
నీకెలా తెలుసు బంగారూ....!!
కలలోని కధలో నీవెవ్వరో....!!
కనుల ఎదుట నీవున్నా....
కనిపెట్టలేని నేనెవ్వరో....!!
అస్పష్టమైన నీ రూపాన్ని
కరిగిపోయిన కలలో కాంచి
స్పష్టంగా గీయాలన్న నా యత్నం....!!
అమ్మదనపు హక్కుతో
నాలో చేరిన నువ్వు
నా ప్రతి రూపంగా నాలో నీ
ఆకారాన్ని పొందే ప్రయత్నంలో....!!
నీ స్పర్శ సుతి మెత్తగా తగిలి
నాలో నువ్వున్నావని గుర్తించిన వేళ...!!
నాలోని మమకారమో...
నీలొని మాయాజాలమో...
నాకే తెలియకుండా నా తలపులన్ని నీతోనే...!!
ఆకృతి లేని నీకు అర్ధం కాదనుకున్న
నా మనసు భాష నీకు తెలిసిందో...!! ఏమో ...!!
నీ కదలికల అలజడితో...
భాష తెలియని బంధంతో
పాశాన్ని పెనవేసుకున్నావు నాతో...!!
ఎప్పుడెప్పుడు నిను చూస్తానా...!!
కలలోని ఊసులు నిజంగా నీతో చెప్పాలని...
నాలో జీవమైన నీ సజీవ చిత్రాన్ని
చూసుకోవాలని పడే తాపత్రయం....!!
నా గీతల్లో ఉంది నువ్వే అని
నా ఎదురుగా ఉన్న నీ చిత్తరువు చెప్తున్నా....
నా ప్రతిరూపమైన అపురూపమైన
నీ ఆగమనం కోసం ఆత్రంగా
ఎదురు చూస్తున్న అమ్మని
నేనే అని నీకెలా తెలుసు బంగారూ....!!
ఈ పై కవిత నేను ఒకే ఒకసారి తానా పోటీలకి రాసిన కవిత... చాలా ఇష్టంగా రాసిన మనసు కవిత ఇది... పోటీలకి రాయడం నా స్వభావానికి విరుద్దం కాని మనసుకు నచ్చిన అంశం కనుక ఎందుకో రాయాలనిపించి రాశాను.... గెలుపొందలేదు కాని మన ముఖ పుస్తకంలో పెడితే ఈ కవితకు వచ్చిన స్పందనలకు అక్కడి గెలుపు కన్నా ఎక్కువ సంతోషం అందింది... ఆ ఆనందాన్ని మాటలలో చెప్పలేను ... చాలా తక్కువగా పోటీలకి రాస్తుంటాను... ఎందుకో తెలియదు మనసుకు అనిపించింది రాయడమే తెలిసిన నాకు పోటీలకి రాసే స్థాయి లేదని నా అభిప్రాయం... అందుకనే రాయను... బహుమతి రానంత మాత్రాన మనసుకు నచ్చి రాసిన కవితలు ఎందుకు పనికిరానివి కాదు... ఆ సమయంలో న్యాయ నిర్ణేతలకు మరొక అంశంలోని కవిత నచ్చి ఉండవచ్చు... లేదా గొప్ప కవితలను అర్ధం చేసుకోగలిగిన స్థాయి పిన్న వయసు వారికి ఉండక పోవచ్చు... మన అందరి ఇష్టాలు ఒకేలా ఉండవు కదా.... ఒక్కొక్కరికి ఒక్కో అంశం నచ్చుతుంది... పోటికి రాసిన ప్రతి ఒక్కరు గెలుపు ఆనందాన్ని రుచి చూడాలనే కోరుకుంటారు... కాకపొతే కొందరే ఆ ఆస్వాదన అనుభవిస్తారు... గెలుపొందని కవితల స్థాయి తక్కువ కాదు గెలిచిన కవితల భావన ఎక్కువా కాదు... మన మనసుకు నచ్చితే అంతకన్నా ఇంకా ఏ గెలుపు కావాలి చెప్పండి... ఇక బహుమతులంటారా అవి గొప్ప కవితలకు అవసరం లేదు... బహుమతి ఇస్తే వారిని చిన్నతనం చేసినట్లే... ఎందుకంటే కొన్ని కవితల్లో భావాలకు శిరస్సు వంచి నమస్సులు చెప్పడం తప్ప మరే విధమైన విలువను ఆపాదించలేము.... అంత గొప్పగా ఉంటాయి అవి... పోటీలు నామ మాత్రాలు... అందరి మనసులను గెలుచుకునే కవితలే నా దృష్టిలో గొప్ప కవితలు...!! ఇది నా మనసులో మాట... ఎవరిని బాధ పెట్టడానికి రాసినది కాదు నాకు నేను సమాధానం చెప్పుకోవడానికి రాసుకున్నది... పెద్ద మనసుతో తప్పుగా ఏమైనా రాస్తే క్షమించండి...!!

19, నవంబర్ 2014, బుధవారం
ఈ జీవితాన్ని అర్పిస్తున్నా...!!
నడత నేర్చిన నైపుణ్యం
చెల్లని సాక్ష్యంగా మిగిలి
నీటిలో నీడలా నిలిచి
ఎదురు చూస్తోంది
అద్దంలో ప్రతిబింబం
హాయిగా నవ్వుతూ
మెరుగులు దిద్దుకుంటూ
మేని వగలు ఒలికిస్తోంది
మనసుని చంపినా
మానసాన్ని వీడని
మమతల రూపాన్ని
దాచుకుని పొంగిపోతోంది
కలతల కన్నీళ్ళని
చెమ్మ లేని కనులలో
చూడొద్దని అనుకున్నా
కాలిన కలని కలగంటున్నా
శుష్కించిన దేహాన్ని
నీ కోరిక మేరకు కానుకగా
మరణశయ్యకు అందిస్తూ
నీకోసం ఈ జీవితాన్ని అర్పిస్తున్నా...!!
చెల్లని సాక్ష్యంగా మిగిలి
నీటిలో నీడలా నిలిచి
ఎదురు చూస్తోంది
అద్దంలో ప్రతిబింబం
హాయిగా నవ్వుతూ
మెరుగులు దిద్దుకుంటూ
మేని వగలు ఒలికిస్తోంది
మనసుని చంపినా
మానసాన్ని వీడని
మమతల రూపాన్ని
దాచుకుని పొంగిపోతోంది
కలతల కన్నీళ్ళని
చెమ్మ లేని కనులలో
చూడొద్దని అనుకున్నా
కాలిన కలని కలగంటున్నా
శుష్కించిన దేహాన్ని
నీ కోరిక మేరకు కానుకగా
మరణశయ్యకు అందిస్తూ
నీకోసం ఈ జీవితాన్ని అర్పిస్తున్నా...!!
వర్గము
కవితలు
ఎలా ఎగిరి పడుతోందో చూడు....!!
ఓ మనిషి.....
నీలి కెరటాలపై నీ తేలియాటలు
కెరటాల కడలే నా ఆట స్థలము
జీవితాన నీకిదో హుషారైన సాయంత్రము
జీవితాంతము నాకిదే జీవనాధారము
సయ్యాటల సంబరాల పోటీలు నీకు
ప్రతి క్షణమూ పోరాటమే నాకు
సాహసాల చప్పట్లు నీవి
చావు బతుకుల సమస్యలు నావి
మన ఇద్దరి కేంద్రము ఈ సంద్రమే
గెలుపోటములను చూస్తూ
ఎలా ఎగిరి పడుతోందో చూడు....!!
16, నవంబర్ 2014, ఆదివారం
మరులు...!!
ఎతికి ఎతికి ఏసారిపోతిని
సూసి సూసి కళ్ళు మసక బారెను
నీ జాడ లేక ఏటి గట్టు సిన్నబోయెను
రాదారంతా సీకటాయెను
సుక్కలన్ని తోడాయెను
నెలపొద్దు చాటుగా బోయెను
మాపటేలకు మరులంటివి
వదలిపోనని మారాము సేస్తివి
మరుపే తెలియని మనసంటివి
ఊసులెన్నో సెప్పి సందె ఏలకు
మల్లెపూలు దెస్తానంటివి
మలిఝూము ముగిసి
తోలి కోడి కూసేను
నీ చేరువ లేక తల్లడిల్లి పోతున్నా
మబ్బుల కబురందుకుని
సల్లగాలి తోడుగా సరసకు రావయ్యా...!!
సూసి సూసి కళ్ళు మసక బారెను
నీ జాడ లేక ఏటి గట్టు సిన్నబోయెను
రాదారంతా సీకటాయెను
సుక్కలన్ని తోడాయెను
నెలపొద్దు చాటుగా బోయెను
మాపటేలకు మరులంటివి
వదలిపోనని మారాము సేస్తివి
మరుపే తెలియని మనసంటివి
ఊసులెన్నో సెప్పి సందె ఏలకు
మల్లెపూలు దెస్తానంటివి
మలిఝూము ముగిసి
తోలి కోడి కూసేను
నీ చేరువ లేక తల్లడిల్లి పోతున్నా
మబ్బుల కబురందుకుని
సల్లగాలి తోడుగా సరసకు రావయ్యా...!!
వర్గము
కవితలు
14, నవంబర్ 2014, శుక్రవారం
కథే ఇది...!!
చీకటి చిక్కబడి
వెన్నెల వెనుకబడి
తారలతో చెప్పిన కథే ఇది
మాటలు తడబడి
అడుగులు జతబడి
మనసుతో చెప్పిన కథే ఇది
మౌనం ముడిపడి
నవ్వులు కలబడి
హృదయంతో చెప్పిన కథే ఇది
చేరువగా నీ సవ్వడి
దూరంగా మది అలజడి
చెలిమితో చెప్పిన కథే ఇది
వినిపించే అలల సడి
కనిపించే కలల ఒడి
నినదించే కడలి కథే ఇది
ఓటమి వెనుకబడి
విజయం కనబడి
గెలుపుతో చెప్పిన కథే ఇది
వెన్నెల వెనుకబడి
తారలతో చెప్పిన కథే ఇది
మాటలు తడబడి
అడుగులు జతబడి
మనసుతో చెప్పిన కథే ఇది
మౌనం ముడిపడి
నవ్వులు కలబడి
హృదయంతో చెప్పిన కథే ఇది
చేరువగా నీ సవ్వడి
దూరంగా మది అలజడి
చెలిమితో చెప్పిన కథే ఇది
వినిపించే అలల సడి
కనిపించే కలల ఒడి
నినదించే కడలి కథే ఇది
ఓటమి వెనుకబడి
విజయం కనబడి
గెలుపుతో చెప్పిన కథే ఇది
వర్గము
కవితలు
తెలుగు సాహితీ ముచ్చట్లు ...ఏడవ భాగం....!!
మన తెలుగు సాహితీ ముచ్చట్లలో సాహిత్యపు ఆటల ఛందస్సు గురించి తెలుసుకునే ప్రక్రియలో ఈ వారం మత్తేభవిక్రీడితము గురించి తెలుసుకుందాం... విక్రీడితం అంటే ఆట... మధించిన ఏనుగుల ఆట ఈ మత్తేభవిక్రీడితము... శార్దూలవిక్రీడితము సింహాల ఆట అయితే ఇది మద గజాల గమ్మత్తులాట... ప్రాచీన వృత్తాలలో ఒకటైన శార్దూలవిక్రీడితము గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాము... ఇది సంస్కృత కవులకు ప్రాణాధారము వంటిది... ఓ అజ్ఞాత కవి చేసిన చిన్న ప్రయోగమే మనకు మత్తేభవిక్రీడితమును తెచ్చిపెట్టింది... శార్దూలవిక్రీడితము నందలి మొదటి గురువును రెండు లఘువులుగా మార్చుటే ఈ
ప్రయోగము.... ఛందస్సులో మత్తేభం అని మరొక వృత్తమున్నా మత్తేభవిక్రీడితాన్ని మత్తేభమని పిలవడం వాడుకలో ఉంది...
మత్తేభవిక్రీడితము
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
మత్తేభవిక్రీడితము
నలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం
పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా
పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా
లక్షణములు
స | భ | ర | న | మ | య | వ |
I I U | U I I | U I U | I I I | U U U | I U U | I U |
సి రి కిం | జె ప్ప డు | శం ఖ చ | క్ర యు గ | ముం జే దో | యి సం ధిం | ప డే |
- పాదాలు: నాలుగు
- ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య = 20
- ప్రతిపాదంలోని గణాలు: స, భ, ర, న, మ, య, వ
- యతి : ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము
- ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణలు
సవరక్షార్థము దండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడరా
నవలీలం దునుమాడె రాము డదయుండై బాలుడై కుంతల
చ్చవిసంపజితహాటకం గపటభాషావిఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకన్ దాటకన్.
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
మరిన్ని వివరాలు మత్తేభవిక్రీడితము గురించి తెలుసుకోవాలంటే జెజ్జాల కృష్ణ మోహన రావు గారి వ్యాసం ఉన్న ఈ క్రింది లింక్ మీకు ఉపయోగపడుతుంది
http://eemaata.com/em/issues/200609/910.html
నాకు తెలిసిన మత్తేభవిక్రీడితము గణాలు యతి స్థానాలు ప్రాసయతులు.... చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే.... పేరుకు తగ్గట్టుగానే ఈ మత్తేభవిక్రీడితము కవుల చేతిలో ఎంత చక్కగా ఒదిగి పోయిందో దీని పుట్టుపుర్వోత్తరాల గురించి లోతుగా చూస్తే తెలిసింది.... ఎంత చక్కని పద్యరాజాలు నవరసాలను ఈ మత్తేభవిక్రీడితములో అందించాయో... అద్భుతమైన మన ఛందస్సులో కవులకు ఆట వస్తువుగా శార్దూలవిక్రీడితంతో పాటు మత్తేభవిక్రీడితము కూడా అమరినది... నవరసాలలోని కొన్నిపద్య ఉదాహరణలు మీకు జె కె మోహనరావు గారి వ్యాసం నుంచి అందిస్తున్నాను..... నేను తెలుసుకున్న వివరాలు అందరికి తెలియజెప్పాలన్న కుతూహలము తప్ప మరి ఏ ఉద్దేశ్యము నాకు లేదు....
జెజ్జాల కృష్ణ మోహన రావు గారి వ్యాసం నుంచి వివరాలు సంగ్రహముగా....
దక్షిణాదిన కర్ణాటక మత్తేభవిక్రీడితానికి జన్మస్థానం... రెండవ పులకేశి కాలంలో మొదటగా దీనిని సంస్కృతంలో వాడారు..... తెలుగు శాసనములలో పన్నెండవ శతాబ్దమునకు ముందు మత్తేభవిక్రీడితము వాడుకలో లేదు... భారతములో మొదటి మత్తేభము అరువది ఆరవ పద్యము! అది-
అమితాఖ్యానక శాఖలం బొలిచి, వేదార్థామలచ్ఛాయమై
సుమహద్వర్గ చతుష్కపుష్పవితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో-
త్తమ నానాగుణ కీర్తనార్థఫలమై, ద్వైపాయనోద్యాన జా-
త మహాభారతపారిజాత మమరున్, ధాత్రీసురప్రార్థ్యమై
– నన్నయభట్టు, ఆదిపర్వము (1.66)
ఇంచుమించు ఇదే భావములతో ఇంతకంటె సుందరముగా బమ్మెర పోతన భాగవత అవతారికలో క్రింది పద్యమును వ్రాసినారు. అది కూడ ఒక మత్తేభమే.
లలితస్కంధముఁ, గృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం-
జులతాశోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో-
జ్జ్వల వృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై
– పోతన, భాగవతము (1.20)
పద్యం పేరును పద్యంలో వచ్చేటట్లుగా రాస్తే అది ముద్రాలంకారం అవుతుంది.... నన్నయగారి క్రింది పద్యమునకు ముద్రాలంకారపు పోలికలు గలవు. ఇది శకుంతలాదుష్యంతుల కుమారుడైన భరతుని బాల్య క్రీడలను వర్ణించు పద్యము.
అమితోగ్రాటవిలోనఁ గ్రుమ్మరు వరాహ వ్యాళ శార్దూల ఖ-
డ్గ మదేభాదులఁ బట్టి తెచ్చి, ఘనుఁడై కణ్వాశ్రమోపాంత భూ-
జములం దోలిన కట్టుచుం బలిమిమై శాకుంతలుం డొప్పె వ-
న్య మదేభంబుల నెక్కుచుం దగిలి నానా శైశవక్రీడలన్
– నన్నయ భట్టు, ఆది (4.64)
శార్దూలమత్తేభవిక్రీడితాలు వీరరసపోషణకై ఎక్కువగా ఉపయోగించబడినవి. మత్తేభమును కవులు శౌర్యరసముతోబాటు మిగిలిన అన్ని రసములను వర్ణించుటకు కూడ ఉపయోగించారు. ఇది ఎలా అవుతుంది అని అనుకోవచ్చు. శార్దూలవిక్రీడితములోని మొదటి గురువును రెండు లఘువులుగా చేయుటవలన పదలాలిత్యము సాధ్యమవుతుంది. మూడు గురువులు ఒక్కుమ్మడిగా వస్తే సంస్కృత పదాలను వాడాలి (భీష్మద్రోణకృపాదిధన్వినికర్ఆభీలంబు …) లేకపోతే బిందువుతోనో, ద్రుతముతోనో, పదాలను విరగగొట్టి వాడాలి (సింగంబాకటితో …). కాని మొదటి గురువు లఘువైనప్పుడు మనకు పదప్రయోగానికి అవకాశాలు ఎక్కువవుతాయి. అందుకే శార్దూలవిక్రీడితముకన్న మత్తేభవిక్రీడితాలు తెలుగులో ఎక్కువ. దీనిని నిరూపించుటకు క్రింద కొన్ని పద్యములను చూడండి . అనుభూతులు కలిగించే నవరసములు ఆలంకారికుల దృష్టిలో ఇవి- శృంగారము, హాస్యము, కరుణ (శోకము), వీరము, రౌద్రము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము. విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణిలో వీనిని ఈ క్రింది విధముగా వివరించెను-
క్రమమున శృంగారము హా-
స్యముఁ గరుణము రౌద్ర వీర సంజ్ఞంబులు ఘో-
రము బీభత్సము నద్భుత
సమాఖ్య శాంతములు ననగఁ జను నవరసముల్
– పెద్దన, కావ్యాలంకారచూడామణి, (2.88)
మగుడం గీచకుఁ బట్ట, వాఁడును బలోన్మాదంబునన్, బాహుగ-
ర్వగరిష్ఠుం డగు నా హిడింబరిపుఁ దీవ్రక్రోధుఁడై పట్టి బె-
ట్టుగఁ ద్రోపాడఁగ నిద్దఱున్ భుజబలాటోపంబుమై నొండొరున్
మిగులం జాలక కొంతసేపు వడి మేమేఁ బోరి రుగ్రాకృతిన్
– తిక్కన, విరాట (2.343)
శృంగారరసం :
అతి మోహోన్నతి తారఁ బాసి, శశి చింతాక్రాంత చిత్తంబుతో
వెతతో వెంకకు నీడ్చు పాదములతో విభ్రాంతి భావంబుతో
ధృతిహీనస్థితితో దృగంచల సముద్వేలాశ్రుపూరంబుతో
మతిఁ జింతించుచు వేఁగి యొక్క వనసీమన్ గుంజ గర్భంబునన్
-వేంకటపతి, శశాంకవిజయము (4.46)

వీరరసం :

ఇలా అన్ని రసాల పోషణ మత్తేభవిక్రీడితానికి చెల్లింది...చివరిగా అందరికి తెలిసిన రెండు మత్తేభాలు
పైన చెప్పిన ఉదాహరణములతో మత్తేభవిక్రీడితవృత్తపాత్రలో ఏ రసమునైనను
నింపుటకు సాధ్యము అని తెలుస్తోంది. ఈ సాహితీ ముచ్చట్లు ముగించే ముందు అందరికి చిరపరిచితమైన
ఒక రెండు మత్తేభవిక్రీడితములు మీకోసం .. పోతన
గజేంద్రమోక్షములో, వామనచరిత్రలో, రుక్మిణీకళ్యాణములో రసవత్తరమైన
మత్తేభవిక్రీడితములు ఉన్నాయి. వాటిలో రుక్మిణీకల్యాణ ఘట్టములోని క్రింది పద్యమును ఎరుగనివారు అరుదు.
చదువురానివారు కూడ కంఠతా పట్టిన పద్యములలో ఇది ఒకటి.
ఘనుఁ డా భూసురుఁ డేగెనో నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో
విని కృష్ణుం డది తప్పుగాఁ దలచెనో విచ్చేసెనో యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలఁపడో యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో నా భాగ్య మెట్లున్నదో
– పోతన, భాగవతము (10.1.1725)
రెండవ పద్యము నంది తిమ్మనగారి పారిజాతాపహరణములోనిది.
జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన-
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిర మచ్చో, వామ పాదంబునం
దొలఁగంద్రోచె లతాంగి, యట్ల యగు, నాథుల్ నేరముల్ సేయఁ, బే-
రలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే
– తిమ్మన, పారిజాతాపహరణము- 1.121
నవమాలల్ బలు గూర్చవచ్చు వరవీణాపాణి పూజార్థమై
నవరాగమ్ములఁ బాడవచ్చు రసవిన్యాసమ్ముతోఁ, జిత్తసం-
భవభావమ్ముల వ్రాయవచ్చు రహితో మత్తేభవిక్రీడిత-
మ్మవ, హృద్యమ్ముగ నింపవచ్చుఁ గవితన్ మందారమాధుర్యముల్.
వివరణ - జెజ్జాల కృష్ణ మోహన రావు గారి సౌజన్యంతో .....ఘనుఁ డా భూసురుఁ డేగెనో నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో
విని కృష్ణుం డది తప్పుగాఁ దలచెనో విచ్చేసెనో యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలఁపడో యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో నా భాగ్య మెట్లున్నదో
– పోతన, భాగవతము (10.1.1725)
రెండవ పద్యము నంది తిమ్మనగారి పారిజాతాపహరణములోనిది.
జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన-
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిర మచ్చో, వామ పాదంబునం
దొలఁగంద్రోచె లతాంగి, యట్ల యగు, నాథుల్ నేరముల్ సేయఁ, బే-
రలుకం జెందిన యట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే
– తిమ్మన, పారిజాతాపహరణము- 1.121
ఒకే మట్టితో కుమ్మరివాడు ఎన్నో రకాల పాత్రలను చేస్తాడు. అదే విధముగా ఒక మత్తేభవిక్రీడితవృత్తములో ఎన్ని రసముల నైనను నింపవచ్చు. కవీంద్రుల కలములో ఈ మత్తగజము ఎన్ని ఆటల నాడిందో, ఎన్ని పాటలను పాడిందో, ఎన్ని గుండెలను తాకిందో, ఎన్ని అనుభూతులను కలిగించిందో. ఈ ఏనుగుల ఆట నవరసాలకు బాటయే!
నవమాలల్ బలు గూర్చవచ్చు వరవీణాపాణి పూజార్థమై
నవరాగమ్ములఁ బాడవచ్చు రసవిన్యాసమ్ముతోఁ, జిత్తసం-
భవభావమ్ముల వ్రాయవచ్చు రహితో మత్తేభవిక్రీడిత-
మ్మవ, హృద్యమ్ముగ నింపవచ్చుఁ గవితన్ మందారమాధుర్యముల్.
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
వర్గము
సాహిత్యం
13, నవంబర్ 2014, గురువారం
ఎన్నడో....!!
రాగాలు తీసే కోయిల
నీ స్వరాన్ని చేరలేదెందుకో
వేవేల వర్ణాలు వెలసిన చిత్రము
నీ కనులలో కనిపించెనెందుకో
పెదవి దాటని పలకరింపు
నీ మది తలపులను దాచెనెందుకో
మరుగున పడిన చిరునగవు
నీ మోమున నాట్యమాడలేదెందుకో
జ్ఞాపకాల రెక్కల చప్పుడు
నీ హృది దాటి వచ్చేదెప్పుడో
తల్లడిల్లే తనువు ఊరడిల్లి
నీ మనః గవాక్షాన్ని తెరిచేదెప్పుడో
వెన్నెల వసంతాలు చుక్కల పక్కను
నీ చెంతను చేరి సేద తీరేదెన్నడో....!!
నీ స్వరాన్ని చేరలేదెందుకో
వేవేల వర్ణాలు వెలసిన చిత్రము
నీ కనులలో కనిపించెనెందుకో
పెదవి దాటని పలకరింపు
నీ మది తలపులను దాచెనెందుకో
మరుగున పడిన చిరునగవు
నీ మోమున నాట్యమాడలేదెందుకో
జ్ఞాపకాల రెక్కల చప్పుడు
నీ హృది దాటి వచ్చేదెప్పుడో
తల్లడిల్లే తనువు ఊరడిల్లి
నీ మనః గవాక్షాన్ని తెరిచేదెప్పుడో
వెన్నెల వసంతాలు చుక్కల పక్కను
నీ చెంతను చేరి సేద తీరేదెన్నడో....!!
వర్గము
కవితలు
వెలుగు విరజిమ్ము...!!
డాబు లేని హోదా ధరణిలో అగుపించిన.... శమంతక మణి వోలే వెలుగు విరజిమ్ము
వర్గము
ఏక వాక్య కవిత
విరించి...!!
లోకనాయకులు త్రిమూర్తులలో ఒకరై
విశ్వమూర్తికి తనయుడై జగత్ సృష్టికి మూలమై
అక్షరబ్రహ్మ వీణాపాణికి అర్ధ భాగమై
చతుర్వేదాల నిలయమైన సృష్టికర్త
బృగు మహర్షి కోపానికి బలై శాపవశమున
గుడిలేక పూజలందని పుణ్యమూర్తి
చతుర్ముఖుడు సృష్టించిన సకల ప్రాణికోటిలో
ఉత్తమమైన జన్మగా అందించిన మానవజన్మలో
విధాత చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలం
విరించి విరచించిన కవనాలు ఈ జీవితాలు...!!
వర్గము
కవితలు
12, నవంబర్ 2014, బుధవారం
వసి వాడని....!!
కదిలే కాలం వదలిన జ్ఞాపకాల ఆనవాళ్ళు
మదిలో దాగిన మౌన వీచికలు
వద్దంటున్నా వదలిపోని స్మృతి కలశాలు
మరపులేని మధురాక్షరాలు
రాలిపడిన పొగడపూల సుగంధాలు
చిన్ననాటి తీపి గురుతులు
కప్పిన మంచుపూల పరదాలు తీసిన
వేకువ పిలిచిన పిలుపులు
దాచుకున్న అక్షరాల దాగని భావనల రూపాల
అమరికలో తొంగి చూస్తున్న గేయాలు
వెన్నెల దొంతరల్లో దోబూచులాడుతూ తిమిరపు
చుట్టాన్ని సాగనంపిన తారకలు
జ్ఞాపకాల సంతకాల సంతసాలు విలసిల్లే గతాన్ని
వసి వాడని వన మయూరంలా ఆస్వాదించు...!!

రాలిపోతున్న చిన్నతనం....!!
కనిపించని ఈ విశాల ప్రపంచంలో ఉంటూ
ఆటలు పాటలు ఎరుగని అంధకారంలో మగ్గుతూ
రాళ్ళు రప్పల పాలై ఆవిరౌతున్న చిన్నతనం
పాలుగారే పసి బుగ్గల పసిడి బాల్యం
మూటల బరువుకు చతికిల పడి లేవలేక
ఆకలి కేకలు అరణ్య రోదనలై కన్నీటితో
కడుపు నింపుకుంటున్న జీవాలు కోకొల్లలు
ఆకలి రక్కసి కోరల్లో చిక్కినా అన్యాయానికి బలైనా
ఆత్మీయత కోసం అలమటించే బడి బాట పట్టని
పలకాబలపం తెలియని బడుగు జీవులు
దైవానికి నేస్తాలైనా దయలేని దానవులు
చిన్న చూపు చూస్తున్నా జానెడు పొట్ట కోసం
పిడికెడు మెతుకుల ఆరాటానికి బండెడు చాకిరీకి
భయపడని చిన్నారుల చేతుల్లో బలానికి
వారి జీవిత పోరాట నైపుణ్యానికి జోహార్లు....!!
వర్గము
కవితలు
11, నవంబర్ 2014, మంగళవారం
కడలి....!!
ఆకశాన్ని చుంబించే ఆహ్లాదాన్ని పంచే
అలల కలల అందమైన కావ్యమా
తీరంలో నీ ఆరాటంలో కనిపించే ఆనందం
లోలోన నీలో దాగిన అంతర్మధనానికి
అందని తార్కాణం నీ ప్రశాంతత
పడిలేచే కెరటాల జీవితం చెప్పే సంకేతం
ఓటమిలో సైతం నేర్పెను సహనం
కోపంలో ప్రళయ ఘీంకారం ఒక్కసారిగా
మృత్యు ఘోషల మరణ మృదంగ నాదం
ఓరిమి అంతరించిన న్యాయానికి గుర్తుగా
మనిషికి నేర్పిన నడకల నడతల పాఠం
సుందర సాగర తీరం అదే అదే
ప్రకృతి వైపరీత్యాల సమ్మేళము అదే
ఆనంద విషాదాలను తనలోనే
ఇముడ్చుకున్న చూడ చక్కని కడలి...!!
అలల కలల అందమైన కావ్యమా
తీరంలో నీ ఆరాటంలో కనిపించే ఆనందం
లోలోన నీలో దాగిన అంతర్మధనానికి
అందని తార్కాణం నీ ప్రశాంతత
పడిలేచే కెరటాల జీవితం చెప్పే సంకేతం
ఓటమిలో సైతం నేర్పెను సహనం
కోపంలో ప్రళయ ఘీంకారం ఒక్కసారిగా
మృత్యు ఘోషల మరణ మృదంగ నాదం
ఓరిమి అంతరించిన న్యాయానికి గుర్తుగా
మనిషికి నేర్పిన నడకల నడతల పాఠం
సుందర సాగర తీరం అదే అదే
ప్రకృతి వైపరీత్యాల సమ్మేళము అదే
ఆనంద విషాదాలను తనలోనే
ఇముడ్చుకున్న చూడ చక్కని కడలి...!!
వర్గము
కవితలు
10, నవంబర్ 2014, సోమవారం
ఓ కొత్త పరిచయం...!!
నేస్తం....
ఇప్పటి జీవితాలు చూస్తుంటే నాకు అనిపిస్తోంది ... మనం ఆధునికంగా ఎంత ముందుకుపోయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు... ఒకప్పుడు కలం స్నేహాలు అప్పట్లో ఎంతో కొంత ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్నాయి... చెడు జరిగినా చాలా తక్కువ స్థాయిలోనే ఉండేది.... చక్కని భావాల వారధిలా సాగేవి అప్పటి స్నేహాలు... ఇప్పుడు అలానే ఉన్నాయి చాలా పరిచయాలు... కాని కొన్ని స్నేహాలు ఎందుకో విపరీతంగా అనిపిస్తూ ఉంటాయి... అంతర్జాలంలో ఈ ముఖ పుస్తకంలో ఉండే అమ్మాయిలు/అబ్బాయిలు అందరు చెడ్డవారు కాదు... అలా అని కొందరు లేరని చెప్పలేము... ఒకొకరు అమ్మాయి పేరు పెట్టేసుకుని స్నేహానికి అనుమతి పంపడము లేదా మరికొందరేమో మరికొంచం ముందుకి వచ్చి వావి వరుసలు, వయసు తారతమ్యాలు చూడకుండా ఇష్టం వచ్చినట్టు రాసేయడం... వాళ్ళకి అన్ని అనుబంధాలు ఉంటాయి కదా... ఈ ముఖ పుస్తకంలోనికి వచ్చినంత మాత్రాన ఇలా ఎంత మాట పడితే అంత మాట అనేయడమే.... పెద్దవారు, చిన్నవారు అని కూడా లేదు... ఈ ఇష్టాలు, ప్రేమలు అన్ని ఆగేది ఒకచోటే.... అదే కోరిక.... నాకు ఇన్ని రోజుల నుంచి చూస్తున్న పరిస్థితిని బట్టి అర్ధం అయ్యింది అదే....
ఇన్నాళ్ళ మన స్నేహంలో ఎప్పుడు ఈ ఆడ /మగ తేడాలు కాని... పరిధులు దాటిన సమయం కాని ఎప్పుడు వచ్చిన దాఖలా కనిపించలేదు.... మరి ఈ తేడాలు ఇప్పటి స్నేహాల్లో ఎందుకో... ఈ విపరీత పోకడలు ఎక్కడికి దారి తీస్తాయో అని ఒకింత భయంగా కూడా ఉంది.... ఓ కొత్త పరిచయం అంటే భయంగా కాకుండా బంధంగా అనిపించాలి.... పరిధులు దాటని స్నేహాలు పది కాలాలు పదిలంగా ఉంటాయి... బాధ్యతలు, బాధలు పంచుకున్న ఆత్మీయ బంధాలు చిరకాలం నిలచిపోతాయి మన స్నేహంలా... అందుకే నాకు అత్యంత ప్రీతికరమైన నేస్తంగానే ఉండిపో ఎప్పటికీ.... నీ నెచ్చెలి

9, నవంబర్ 2014, ఆదివారం
జగతి సిగలోని...!!
జగతి సిగలోని జాబిలమ్మా
ముదిత మదిలోని మనసు బొమ్మా
చెప్పవమ్మా సంతసాల చిరునామా
జారిపోయిన జ్ఞాపకాలు వెదకినా
జరిగిపోయిన గతాన్ని తడిమినా
మిగిలిన సంతోషాలు వెల తెల పోతున్నాయి
గడపలోని చిరునవ్వు ఎదురుచూస్తూ
గాయాలను దాచుకుంటూ కాలాన్ని కప్పుకుంటూ
కన్నీటిలో వెన్నెల చుక్కలను కడిగేస్తోంది
విరించి విరచించిన కవనం గతి తప్పిన
నుదుటిరాతగా మారి అక్షర దాహార్తిలో
ఆలంబన కోసం సేదదీరుతోంది.....!!
ముదిత మదిలోని మనసు బొమ్మా
చెప్పవమ్మా సంతసాల చిరునామా
జారిపోయిన జ్ఞాపకాలు వెదకినా
జరిగిపోయిన గతాన్ని తడిమినా
మిగిలిన సంతోషాలు వెల తెల పోతున్నాయి
గడపలోని చిరునవ్వు ఎదురుచూస్తూ
గాయాలను దాచుకుంటూ కాలాన్ని కప్పుకుంటూ
కన్నీటిలో వెన్నెల చుక్కలను కడిగేస్తోంది
విరించి విరచించిన కవనం గతి తప్పిన
నుదుటిరాతగా మారి అక్షర దాహార్తిలో
ఆలంబన కోసం సేదదీరుతోంది.....!!
వర్గము
కవితలు
8, నవంబర్ 2014, శనివారం
తెలుగు సాహితీ ముచ్చట్లు ...ఆరవ భాగం....!!
వారం వారం బోలెడు ముచ్చట్లు తెలుగు సాహిత్యం గురించి చెప్పుకుంటున్నాము కదా... ఈ వారం మత్తుగా ఉంటూ హాయిగా సాగిపోయే మత్తకోకిల గురించి.... మత్తకోకిల భలే బావుంటుంది ఈ పేరు వినడానికి... ఇక వృత్తాల విషయానికి వస్తే మత్తకోకిల గమ్మత్తుగా చేసే గమకాలు పసందుగా ఉంటాయి... మత్తకోకిల వృత్తంలో భాషలకు అమ్మ భాషైన సంస్కృతంతో పాటు తెలుగు,తమిళం, కన్నడ భాషలే కాకుండా సంగీతముతో సమ్మిళితమై ఎన్నో రాగాలు మత్తుగా సాగిపోతుంటాయి మనకు తెలియకుండానే...మన తెలుగు సాహితీ ముచ్చట్లలో ఈ వారం మత్తకోకిల గుణగణాలు కాసిని చూద్దాం.... మా తెలుగు మాష్టారు చెప్పినవే కాకుండా పెద్దలు చెప్పిన నాకు తెలియని ఎన్నో విశేషాలను జోడించి మీతోపాటుగా నాకు నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చిన సాహితీ సేవకు కృతజ్ఞతలతో....
రాజభూషణ నిత్యసత్య సరస్వతీవిలసన్ముఖాం
భోజ రాజమనోజ భూజనపూజ్యమాన మహాయశో
రాజహంస పయోజినీవనరమ్య దిఙ్ముఖ విక్రమో
ద్వేజితాహిత విష్ణుసన్నిభ విష్ణువర్ధనభూపత
ఉదాహరణ 2
అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్
ధన్యులై వినఁ బాంచజన్యము దారితాఖిల జంతు చై
తన్యము¦ భువనైకమాన్యము దారుణస్వన భీత రా
జన్యమున్ బరిమూర్ఛితాఖిలశత్రు దానవసైన్యమున
మరిన్ని మత్తకోకిల వివరణల కోసం ఈ లింక్ ను చూడండి
జె కె మోహనరావుగారి వ్యాసంలో చాలా చక్కని వివరాలు మీ అందరి కోసం.....
http://eemaata.com/em/issues/201207/1964.html?allinonepage=1
వివరణ - జెజ్జాల కృష్ణ మోహన రావు గారి సహకారంతో .....
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
మత్తకోకిల
సత్తయౌ రసజాభరల్ భవసంఖ్య విశ్రమ మొప్పినన్ మత్తకోకిల వృత్తమౌన సమానరంగనృపాలకా.
లక్షణములు
- ఈ పద్య ఛందస్సుకే చర్చరీ , మల్లికామాల , మాలికోత్తరమాలికా , విబుధప్రియా , హరనర్తన , ఉజ్జ్వల అనే ఇతర నామములు కూడా కలవు.
- వృత్తం రకానికి చెందినది
- ధృతి ఛందమునకు చెందిన 93019 వ వృత్తము.
- 18 అక్షరములు ఉండును.
- 26 మాత్రలు ఉండును.
- మాత్రా శ్రేణి: U I U - I I U - I U I - I U I - U I I - U I U
- మిశ్రగతి శ్రేణి (3-4) : U I - U I I - U I - U I I - U I - U I I - U I - U
- 4 పాదములు ఉండును.
- ప్రతి పాదమునందు ర , స , జ , జ , భ , ర గణములుండును.
- ప్రాస నియమం కలదు, ప్రాస యతి చెల్లదు
- ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
నడక
- మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
- తాన తానన తాన తానన తాన తానన తాన తా
రాజభూషణ నిత్యసత్య సరస్వతీవిలసన్ముఖాం
భోజ రాజమనోజ భూజనపూజ్యమాన మహాయశో
రాజహంస పయోజినీవనరమ్య దిఙ్ముఖ విక్రమో
ద్వేజితాహిత విష్ణుసన్నిభ విష్ణువర్ధనభూపత
ఉదాహరణ 2
అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్
ధన్యులై వినఁ బాంచజన్యము దారితాఖిల జంతు చై
తన్యము¦ భువనైకమాన్యము దారుణస్వన భీత రా
జన్యమున్ బరిమూర్ఛితాఖిలశత్రు దానవసైన్యమున
మత్త కోకిల గణాలు రాసి చూస్తే అది యెంత "symmetric" గా ఉందో అర్థమవుతుంది. కొంచెం నేర్పుగా రాస్తే ఈ వృత్తంలో "palindromes" రాయవచ్చు!
మరిన్ని మత్తకోకిల వివరణల కోసం ఈ లింక్ ను చూడండి
జె కె మోహనరావుగారి వ్యాసంలో చాలా చక్కని వివరాలు మీ అందరి కోసం.....
http://eemaata.com/em/issues/201207/1964.html?allinonepage=1
వివరణ - జెజ్జాల కృష్ణ మోహన రావు గారి సహకారంతో .....
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
వర్గము
సాహిత్యం
6, నవంబర్ 2014, గురువారం
రెప్ప పడిన మలి సంతకాలు...!!
అమ్మ చెప్పిన చందమామ కధలు
నాన్న చనువుగా నేర్పిన ఆటల అల్లరి
చదువు చెప్పిన గురువుల నీతి పాఠాలు
పసితనాన్ని పసిడి తునకగా మార్చినా....
నేర్చుకున్న నాణ్యత కోసం నడతను మార్చుకొనక
నేస్తాల సాహచర్యాన్ని స్వాగతిస్తూ సాగిన సందడి
పండుగల పరవశంలో పండించిన సంతోషాలు
సంస్కృతి సంప్రదాయాలను మరువని కౌమారం దాటుతూ....
కొత్త వింతల సరదాల లోకంలో మరచిన నైతికత్వం
ఉగ్గుపాల విలాసాల విన్యాసాల విపరీతాలు
విలక్షణ అర్ధాల వింత పోకడలు చూపిస్తూ
అమ్మ ప్రేమకు ధీటుగా యుక్త వయసు మైత్రిలో మునుగుతూ...
జతను చేరిన అనుబంధానికి గుర్తుగా మరో ప్రస్థానానికి నాందిగా
మొదలైన జీవిత సమర ప్రాంగణంలో అతిధిగా నిలిచి
నిలకడ కోసం నిరంతర యత్నాల కోరికల సాఫల్యం కోసం
ఎటు కాని మధ్యస్థంలో కొట్టుమిట్టాడే ప్రాణం వగచే నడివయసూ....
బాధ్యతల బంధాలను దాటుకుని బాసట కోసం తపించే తనువు
ఆత్మీయత కొరవడి గతాన్ని తలుస్తూ గాయాలను చేసుకుంటూ
జ్ఞాపకాలను ఓదార్పుగా... నిట్టూర్పుల స్నేహంలో నిదురించే
కాలాన్ని ఒక్కసారి వెనుకకు మరలమనే చివరిదశ ఈ ముసలితనమూ...
పుట్టినప్పుడు పాలకేడ్చినా వయసుపొంగులో ముద్దుమురిపాలకైనా
నా అన్న బాధ్యతల కోసం తప్పులేదంటూ న్యాయాన్ని ఏడిపించినా
ఒకనాడు నైతికతను మరచి అనైతికానికి పట్టంకట్టినా తెలియని
మనసు రోదన వినిపించిన క్షణాలు... అవే రెప్ప పడిన మలి సంతకాలు...!!

5, నవంబర్ 2014, బుధవారం
ఏటి గట్టున....!!
యాడాదికోపాలి జాతర కెల్దామంటివి
సద్ది బువ్వ, సల్ల మనతో తీసుకెల్దామంటివి
మనసైన మట్టి గాజులు కొనిస్తానంటివి
సంపెంగ ముక్కుకు ముక్కెర సొగసంటివి
సొట్ట బుగ్గల నవ్వు సందె ఎలుగంటివి
ముచ్చటగ ముచ్చట్లెన్నో సెప్పి మల్లొస్తానంటివి
జాడైన కానరాలేదు ఝాము రాతిరి వరకు
యాడికి బోయావో ఎర్రి నా మావ
మాయదారి లోకాన మన లేవు
జాగు సేయక జతను చేరవయ్య
బాసలన్ని నీటిరాతల పాలు కానియ్యకు
ఏటి గట్టున ఎదురు సూపుల ఎడద
నిలువలేక నీ కోసమే తానయ్యేను....!!

4, నవంబర్ 2014, మంగళవారం
ఏటిజేతును చెప్మా....!!
ఎదురు సూపుల ఎద ఏటి గట్టునే ఉండాది
మనువాడినా మావ మసక సీకటైనా రాలేదు
సందె ఎలుగు మెల్లంగ సన్నగిల్లిపోతాంది
సుక్కలన్ని చల్లనయ్య పక్కకు సేరాయి
మబ్బుల్లో మసక ఎన్నెల కమ్మినాది
మనసేమో గుబులుగా ఊసులాడినాది
చెంత లేని జతను చేరగా రమ్మని పిలుస్తూ
యాడికెల్లినాడో ఈ మావ ఏకువైనా రాలేదు
ఈ పొద్దు మా పొద్దంటూ జాగారమే జతయ్యేను
యాదికైనా రాకపోయే ఈ ఎంకి ఏటిజేతును చెప్మా....!!
పై కవిత ఉపశమన తరంగాలు చిత్ర కవితా పోటిలో నన్ను ప్రధమ విజేతగా నిలిపింది ....ఉపశమన తరంగాలు సమూహానికి న్యాయనిర్ణేతలకు నా కృతజ్ఞతలు ... సహవిజేతలకు నా మనఃపూర్వక అభినందనలు.... !!
వర్గము
కవితలు
3, నవంబర్ 2014, సోమవారం
ఏమిటో ఈ జీవితాలు...!!
నేస్తం...
ఎందుకో కాస్త బాధగా ఉంది.... రోజు చూస్తున్న మనుష్యులే అయినా, ఆ మనస్తత్వాలే అయినా.. ఎంతగా అలవాటు పడిపోయినా ఏదో ఒక క్షణం ఈ బాధను పంచుకొనక తప్పడం లేదు... తెల్ల కాగితానికి చిన్న నల్ల చుక్కను పెట్టి ఇదేమిటి అని అడిగిన చక్రం సినిమాలో సంఘటన నన్ను వెన్నాడుతూనే ఉంది... ఎందుకిలా మనం ఎదుటివారిలో తప్పునే ఎక్కువగా చూస్తున్నాము... కాస్తయినా మంచిని చూడలేక పోతున్నాము... మన మనసులు ఇంత సంకుచితంగా మిగిలిపోతున్నాయి... ఎందరిలో ఉన్నా మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అనుకుంటే ఎలా సరిపోతుంది... మనం చేసే పని వల్ల కాని, మన వ్యక్తిత్వం వల్ల కాని, మన హావభావాల ప్రకటన వలన కాని, మన నడవడిక వలన కాని మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది.. అంతే కాని మన దగ్గర ఉన్న దనం వలన కాని, అలంకరణ, వేష భాషల వలన వచ్చే గౌరవం తాత్కాలికమే అవుతుంది... అందరి మనస్సులో శాశ్వతంగా మిగిలిపోయేది మన మంచి మనసు వలనో లేదా మనం చేసే మంచి పనుల వల్లనో నలుగురిలో గుర్తుగా ఉండిపోతే అది ఎప్పటికి అలానే నిలిచిపోతుంది... పెద్ద తెల్లకాగితాన్ని చూడలేని మనం దానిలోని చిన్న మచ్చను మాత్రం తేలికగా గుర్తు పట్టగలం... ఇది మన నైజాన్ని చూపిస్తుంది.... ఎదుటివారిలో మంచిని చూడలేని మనకు మనలో మంచిని మాత్రం తెలుసుకునే అవకాశం ఎలా వస్తుంది....?? ఓ చిన్న మెచ్చుకోలు ఎంతటి ఆనందాన్ని ఇవ్వగలదో ఒకసారి మనం చూడగలిగితే ఆ సంతోషం మనకు తెలుస్తుంది... కాకపొతే మనకు ఎప్పుడు చెడు చూడటమే ఆనవాయితీగా మారిపోయి మంచిని చూడలేక పోతున్నాము.... ఏమిటో ఈ జీవితాలు... ఈ ఉరుకులు పరుగులు...!! ఓ క్షణం పలకరించే తీరుబడి లేని ప్రయాణంగా పరుగెత్తుతూనే ఉన్నాము.... మరి ఎన్ని రోజులో ఇలా...!!
నా భావాలు పంచుకునే ప్రియ నేస్తానివి నువ్వున్నావనే ఇలా నీకు అప్పుడప్పుడు చెప్పడం..... ఉండనా నేస్తం...!!

అంతరంగాలు...!!
భావానికి భాష అలంకారమైతే
ఆత్మాలంకారానికి వేదిక అంతరంగం
పరిణితుల పరిధులు దాటి ప్రవహించే
ప్రవాహ ఉత్తుంగ భావనా తరంగం
అనుభూతుల నివేదన ఆత్మావలోచన
ఎల్లలెరుగని ఊహా సామ్రాజ్యానికి పట్టమహిషి
మదిలోని అంతరాలను అందించే సాధన యోగం
అంతర్ముఖాన్ని చూపించే మనసు అద్దం
గతానికి వర్తమానానికి మధ్యన వారధిగా
వాస్తవాన్ని శాసిస్తూ కాలంతో పాటుగా
గతంలో పయనించే అంతులేని అనుబంధాల
అద్భుతాల జ్ఞాపకాల జలధి ఈ అంతరంగం....!!
వర్గము
కవితలు
2, నవంబర్ 2014, ఆదివారం
బంగరు బాల్యం....!!
అమ్మ ఒడిలో ఆడుకున్న బాల్యం
ఆనందానికి చిరునామాను చెప్పింది
నేస్తాలను తోడుగా నెయ్యానికి పంపింది
ఆటపాటల ఉల్లాసానికి ఊతమందించి
చదువుసంధ్యల వినయ విధేయతల
వివరాలను గురువులచే చెప్పించి
తప్పుల మెప్పులను తూకమేసి
అద్దంలో ప్రతిబింబంలా అందంగా కనిపిస్తూ
అంతలోనే కనుమాయమయ్యే చిన్నతనం
దైవానికి ఇష్టమైన బంగరు బాల్యం
కాలానికి చిక్కని జ్ఞాపకం ఈ కావ్యం
ప్రతి మనసు గతంలో మళ్ళి మళ్ళి
కావాలనిపించే తన్మయ తాదాత్మ్యం
మధుర సంతకాల మృదువైన మమతల
మణి మాణిక్యాల తారంగమీ బాల్య తరంగం...!!
వర్గము
కవితలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)