అమ్మ ఒడిలో ఆడుకున్న బాల్యం
ఆనందానికి చిరునామాను చెప్పింది
నేస్తాలను తోడుగా నెయ్యానికి పంపింది
ఆటపాటల ఉల్లాసానికి ఊతమందించి
చదువుసంధ్యల వినయ విధేయతల
వివరాలను గురువులచే చెప్పించి
తప్పుల మెప్పులను తూకమేసి
అద్దంలో ప్రతిబింబంలా అందంగా కనిపిస్తూ
అంతలోనే కనుమాయమయ్యే చిన్నతనం
దైవానికి ఇష్టమైన బంగరు బాల్యం
కాలానికి చిక్కని జ్ఞాపకం ఈ కావ్యం
ప్రతి మనసు గతంలో మళ్ళి మళ్ళి
కావాలనిపించే తన్మయ తాదాత్మ్యం
మధుర సంతకాల మృదువైన మమతల
మణి మాణిక్యాల తారంగమీ బాల్య తరంగం...!!
3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
Chaalaa chaalaa baagundi:-)
బాగుంది
మీ స్పందనలకు మనఃపూర్వక ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి