10, డిసెంబర్ 2014, బుధవారం

ఏక్ తారలు...!!

1. ఎడ తెగని ఆలోచనల సంద్రం_గుప్పెడు గుండె గూటిలో నువ్వెలా  చేరావా అని...
2.  నా మదిలో చేరిన నీకు_నా మౌనంలో ఉన్నవి నీ జ్ఞాపకాలే అని తెలియడం లేదూ...
3.  నా హృదయంలో దాగిన నీకు_నా అంతరంగం కరతలామలకమే కదా...!!
4. చలనం లేదని అనుకున్నా_శిల్పానికి నువ్వు ప్రాణం పోశావని తెలియక
5. రాయబారానికి పంపాను_రమణి నీదని గుర్తెరగక

6.భాగమై భారంగా మారావెందుకు_మదిని కలచి వేస్తూ
7. వడబోసి చూసా_అన్ని రాలిన  రాత్రుల రెక్కల నక్షత్రాలే
8. అబద్ధంలో బతికేయ్యడం అలవాటేగా_అటు ఇటు చూసుకుంటూ
9. జ్ఞాపకాలకు అలవాటేగా మరి_నిరంతరం పయనిస్తూనే ఉంటాయి

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner