24, డిసెంబర్ 2014, బుధవారం

ఏక్ తారలు....!!

23/12/14
1. చాలవూ ఈ జన్మకు _ కలగా మెదిలి ... వాస్తవమై నాతోనే చేరిన నీ జ్ఞాపకాలు 
2. మౌనం మనసు పడింది_ముడి పడిన మన జతను చేరాలని ఆశతో
3. రేయి కెందుకో అంత ఆశ_జాబిలిని సైతం దాచేయాలని
4. కలవరానికి అలుపొచ్చిందిట_నిను జపిస్తున్న ఊహల ఉరవడికి
5. ముద్దబంతులు మురిపెంగా తలూపాయి_నీ స్నేహానికి మైమరచి
6. మౌనమెందుకు మన మధ్యలో_మన మనసులు చాలవు మమతలందుకోనూ
7.  గుప్పెడు గుండెనే నీకందించాను_ఇకనైనా ఏకాంతానికి శలవీయవూ....  
8.  వసంతం వచ్చి వెళ్ళింది_ నువ్వు గమనించలేదని అలిగి
9. నీ పక్కనే  ఉన్నా చూడలేదని_అలిగి చీకటితో చెలిమి చేసింది


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner