22, డిసెంబర్ 2014, సోమవారం

శ్రీనాధకవి....!!

వాగ్దేవి తనయునిగా ధరణిపై అవతరించి 
చిరు ప్రాయముననే కావ్య కన్నియలను చేరదీసిన
సున్నిత మనస్కుడతి చమత్కారి, సౌందర్యారాధకుడు
సరస శృంగార పురుషుడు ,  భోజనలాలసుడు
ఆత్మాభిమానాన్ని ఆభరణంగా చేసుకున్న విలాసవంతుడు 
కష్ట సుఖాలకు చాటువులల్లే చారుశీలుడు
కులమత వర్గ విభేదాలెరుగని కవి వర్యుడు
కడగండ్లలో సైతం దైవానికి తల ఒగ్గని ధీశాలి
అమరపురికేగు సమయాన గూడ నందించె 
అందాల పద్యాల అమృత గుళికల జవ్వనిని
తెలుగు తేనియల విరుల కన్నియలను
ఎనలేని సంపదల కావ్య మందారాల ముద్దుగుమ్మలను
వందనాలు వాణి తనయా కవి సార్వ భౌమ శ్రీనాధకవి వరేణ్యా...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner