26, డిసెంబర్ 2014, శుక్రవారం

ఏక్ తారలు....!!

25/12/14
1. కదిలిపోతున్న కాలం_నిన్ను ఇవ్వలేక మరపుని కానుకగా ఇచ్చింది...
2. ముక్కలైన మనసులో_ఎక్కడ చూసినా నీ ప్రతిబింబాలే
3.  మది కెంత ఆరాటమో_నీ పక్కన చేరిన నీడలో కూడా నన్నే చూసుకోవాలని
4. సడి చేయని గాలి సైతం_నీ కోసం వింజామరగా మారింది చూడు
5. రెప్పల మాటునే దాగి చూస్తున్నా_నీ చెక్కిళ్ళను ముద్దాడాలని కోరికగా
6. విధి చేసిన వింతలో_ఈ మరపు మందే అమూల్యం
7. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతోంది పరిమళం_పట్టుకుందామంటే దొరకకుండా 
8. ఎన్నో లేవు ఉన్నవే కొన్ని_అవి నీ కోసమే దాచి ఉంచా
9. అందుకే అందరు_యోగి పుంగవులే
10. మనసు అద్దంలో ఉన్నది నీ బొమ్మే_వేల రూపాలుగా తిష్ట వేసి
11. అవసరానికి అమ్మను కూడా_ బంధీని చేసే బంధమే ఈ అనుబంధం
12. నెలవంక చిన్న బోయింది_తన అందం నీ నడకలో చూసి
13. వసంతం వాదులాడి_శిశిరాన్ని చుట్టేసింది గట్టిగా
14. నీ వెనుకే గాల్లో తేలుతూ_నీతోనే వచ్చేసింది నా మనసు
15. కరిగిపోతున్న కాలంతో పాటు కదులుతున్నా_నీతో పంచుకున్న మధురక్షణాలను తీసుకుని
16. జాబిలమ్మకు కోపం వచ్చింది_ తన పక్కన చుక్కలను నువ్వు తీసుకెళ్లావని
17. ఎదురుగా నువ్వుంటే చాలదూ_మౌనం మాటాడేస్తుంది
18. కలలన్నింటా నువ్వే నిండి_నా వాస్తవమై పోయావు
19. ఎద వీణ  తంత్రులన్ని_నీ ప్రేమ రాగాల పారవశ్యం లోనివే

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner