27, డిసెంబర్ 2014, శనివారం

ఏక్ తారలు....!!

27/12/14
1. మంజీరానికి ఎందుకో అంత సంబరం_నీ పాదాల స్పర్శకు చేరువైనందుకేమో
2. గుప్పెడు గుండెలో దాచాను_అంబరాన్ని తాకిన నా ప్రేమను
3. అక్షరానికి అలుక ఎక్కువైంది_నీ జ్ఞాపకాన్ని పదే పదే తలుస్తున్నానని
4. మౌనానికి మాటలు ఎక్కువైనాయి_నిన్ను చూసిన సంబరంలో
5. రేయికి అలుపెక్కువైంది_నీ తలపుల ఊహలను మోయలేక
6. వసంతం వచ్చి వాలుతుంది_రాలిపోయిన అస్తిత్వాన్ని చిగురింప చేస్తూ
7. ఇలా వచ్చి అలా వెళ్ళే వసంతం ఎందుకు_గుండెల నిండా ప్రేమ చాలదూ
8. ఎక్కడ విన్నా నీ స్వరమే_ముల్లోకాలను తట్టి లేపుతూ
9. నీ కనుల ఎదుటే నే ఉన్నా _దూరమేల మన మద్యన
10. అర్ధం చేసుకున్నా_అంతులేని నీ అనురాగాన్ని
11. ఏకాంతానికి కోపమొచ్చింది_తనతో ఉన్న నిన్ను నా సొంతం చేసుకుంటున్నానని
12. భావాలకు అందకుండా దాక్కుంటున్నాయి_అక్షరాలు అటు ఇటు పరుగులెత్తుతూ
13. మనసు  మౌనంగా చూస్తోంది_తనను ఎక్కడ చదివేస్తారో అని భయపడుతూ
14. అక్షరాల్లో తొంగి  చూడు_నా ప్రేమ స్వచ్చత తెలుస్తుంది
15.  అందుకేనేమో_అన్ని విరిబాలలే ఈ ప్రేమకావ్యం నిండా
16. మెలకువలోనే ఉన్నా_నీ మౌనపు అలజడి నా మది చేరి

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner