16, డిసెంబర్ 2014, మంగళవారం

ఏక్ తారలు...!!

03/12/14
1. అక్షరాలు సేద దీరుతున్నాయి_నీ మనసు పుస్తకాన్ని చదువుతూ
2. వెన్నెల సంతకం చేయవూ_నీ వన్నెల వాకిట వాలడానికి
3. నీ బుగ్గల్లో గులాబీలు పూయించింది _సందె వెలుగు ఎరుపెక్కి
4.శిశిరం చల్లగా జారుకుంది_మావి చివుర్ల అందాలు చూస్తూ
5. కాలే కడుపుకి కూని రాగాలెందుకు_గంజినీళ్ళు చాలవూ
6. చల్లగాలి తాకాలని తొందర పడుతోంది_నీ ముంగురుల లయ విన్యాసానికి
7. భావాలన్ని నీతో ఆడుకుంటున్నాయి_వన్నెలద్దే తీరిక లేక
8. విధాతకు తీరిక లేక_మరణంలో అల్పాయుష్కులు పూర్ణాయుష్కులు  
9. సంబరాలు అంబరాన్ని తాకితే_వన్నెలు వలపు వాకిళ్ళు తెరిచాయి
10. కన్నీరు చెప్పకనే చెప్పేసింది_నీ మది ఆవేదనని
11. చూపులు సిగ్గు బరువుతో వాలాయి_అలకల చిలుకుల అందాలకు
12. చుక్కలన్ని పోటి పడుతున్నాయి_నీ పక్కన చోటు కోసం
13. నింగినే చేరిన నెలవంక సంబరం_సూరీడయ్యకు చెప్పిన వీడ్కోలుతో 
14.శత విధాల ప్రయత్నిస్తున్నాడు_ నీ ప్రేమ కోసం జపిస్తూ
15. పోటి ఎక్కువై పోదూ_ముదితలెక్కువైతే ముడుపులకు
16. పూజకు పువ్వుగా మిగిలిన చాలు_నీ సన్నిధిలో చేరడానికి
17. మాయలెరుగని తారలతో చంద్రుని సల్లాపాలు_ఒకరికి తెలియకుండా మరొకరితో
18. నీ చేరువలో_ఒక్క క్షణమైనా చాలు నా జన్మ ధన్యం
19.  కల్లోల సాగరంలో_ప్రశాంత పయనం
20. రేపుని మరచిన జాబిలి_క్షణాల సరసానికి దగ్గరగా
21.  మౌనాన్ని మాటలలో దాచివేసా_నీ వద్దనుండే పలుకుల తీయదనం ఆస్వాదిద్దామని

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner