ప్రతి వారం మనం చెప్పుకుంటున్న సాహితీ ముచ్చట్లు మీతో పాటుగా నాకు బోలెడు కొత్త విషయాలను నేర్చుకునేదుకు దోహద పడుతున్నాయి... చిన్నప్పుడు పెద్ద బాలశిక్షతో మొదలైన నా చదువు వేమన, సుమతి, కృష్ణ శతకాలతో పాటు గజేంద్ర మోక్షం తో పెరిగి మరెన్నో సంస్కృత పద్యాలు వాటి భావాలు నేర్చుకుంటూ తెలుగు పాఠాలను వల్లే వేస్తూ వాటితో పాటుగా సంధులు, సమాసాలు, అలంకారాలు నేర్చుకుంటూ తరగతుల వారిగా తెలుగు మాష్టారి సహకారంతో వారి తిట్ల దండకాలతో పెరిగి పెరిగి ఎన్నో పుస్తకాలు చదివి వాటిలో నేర్చుకున్న విజ్ఞానాన్ని... తెలియని వాటిని తెలుసుకుంటూ సాగిన నా తెలుగు సాహిత్య ప్రయాణంలో ఎన్నెన్నో తొత్త విషయాలను నేర్చుకున్న / నేర్చుకుంటున్న నేపధ్యాన్ని మీ ముందు ఉంచుతూ ఈ వారం మరి రెండు వృత్త జాతుల లక్షణాలు మీ అందరి కోసం.....
ఇంద్రవజ్రము
పదునొకండవ త్రిష్టుస్ఛంధంబునందుఇంద్రవజ్రయను వృత్తము
సామర్థలీలన్ తతజ ద్విగంబుల్
భూమింధ్ర విశ్రాంతుల బొంది యొప్పున్
ప్రేమంబుతో నైందవ బింబ వక్తృన్
హేమాంబురుం బాడుదు రింద్రవజ్రన్.
గణ విభజన
ఇంద్రవజ్రము వృత్త పాదము నందు గణవిభజన
UUI |
UUI |
IUI |
UU |
త |
త |
జ |
గా |
సామర్థ |
లీలన్ త |
తజద్వి |
గంబుల్ |
ఇంద్రవజ్రము వృత్త పద్యాల లక్షణములు
• | పాదాలు: | నాలుగు |
• |
ప్రతి పాదమునందు అక్షరములు 11 |
• |
ప్రతిపాదంలోని గణాలు: |
త, త, జ, గా |
• |
యతి : |
ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము |
• |
ప్రాస: |
పాటించవలెను |
• |
ప్రాస: యతి |
చెల్లదు |
- వృత్తం రకానికి చెందినది
- త్రిష్టుప్పు ఛందమునకు చెందిన 357 వ వృత్తము.
- 11 అక్షరములు ఉండును.
- 18 మాత్రలు ఉండును.
- మాత్రా శ్రేణి: U U I - U U I - I U I - U U
- మిశ్రగతి శ్రేణి (4-3) : U U - I U - U I I - U I - U U
- మిశ్రగతి శ్రేణి (4-5) : U U - I U U - I I U - I U U
- మిశ్రగతి శ్రేణి (5-4) : U U I - U U - I I U I - U U
- 4 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- ప్రతి పాదమునందు 8 వ అక్షరము యతి స్థానము
- ప్రతి పాదమునందు త , త , జ , గా(గగ) గణములుండును.
ఉదాహరణలు:
- సామర్థ్యలీలన్ తతజద్విగంబుల్
భూమిధ్రవిశ్రాంతుల బొంది యొప్పున్
ప్రేమంబుతో నైందవబింబవక్త్రున్
హేమాంబురుం బాడుదు రింద్రవజ్రన్
- ఈతాజగానిర్మితి నింద్రవజ్రా
నీతాఖ్య వర్తించు వినిర్మలోక్తిన్
ఇత్తా, జ, గా సంగతి నింద్రవజ్రా
వృత్తంబగున్ సన్నుత - వృత్తరేచా !
పోతన తెలుగు భాగవతంలో వాడిన ఇంద్రవజ్రము వృత్త పద్యాల సంఖ్య: 4
(భా-10.1-690-ఇ.)
నీయాన; యెవ్వారిని నిగ్రహింపం
డా యుగ్ర పాపాకృతి నంద డింకన్;
నీ యాజ్ఞలో నుండెడు నేఁటఁగోలెన్
మా యీశు ప్రాణంబులు మాకు నీవే.”
ఉపేంద్రవజ్రము
పురారిము ఖ్యామర పూజనీయున్
సరోజనాభున్ జతజ ద్విగోక్తిన్
దిరంబుగా నద్రి యతి న్నుతింపన్
ఇరానుప్రాణేశు నుపేంద్రవజ్రన్.
గణ విభజన
ఉపేంద్రవజ్రము వృత్త పాదము నందు గణవిభజన
IUI |
UUI |
IUI |
UU |
జ |
త |
జ |
గా |
పురారి |
ముఖ్యామ |
రపూజ |
నీయున్ |
ఉపేంద్రవజ్రము వృత్త పద్యాల లక్షణములు వృత్తం రకానికి చెందినది
• |
పాదాలు: |
నాలుగు |
• |
ప్రతి పాదమునందు అక్షరములు 11 |
• |
ప్రతిపాదంలోని గణాలు: |
జ, త, జ, గా |
• |
యతి : |
ప్రతిపాదంలోనూ 8 వ అక్షరము |
• |
ప్రాస: |
పాటించవలెను |
• |
ప్రాస: యతి |
చెల్లదు |
- త్రిష్టుప్పు ఛందమునకు చెందిన 358 వ వృత్తము.
- 11 అక్షరములు ఉండును.
- 17 మాత్రలు ఉండును.
- మాత్రా శ్రేణి: I U I - U U I - I U I - U U
- త్రిమాత్రా శ్రేణి: I U - I U - U I - I U - I U - U
- షణ్మాత్రా శ్రేణి: I U I U - U I I U - I U U
- మిశ్రగతి శ్రేణి (4-5) : I U I - U U I - I U I - U U
- 4 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- ప్రతి పాదమునందు 8 వ అక్షరము యతి స్థానము
- ప్రతి పాదమునందు జ , త , జ , గా(గగ) గణములుండును.
- ఉదాహరణలు:
- పురారి ముఖ్యామరపూజనీయున్
సరోజనాభున్ జతజద్విగోక్తిన్
దిరంబుగానద్రియతిన్నుతింపన్
ఇరాసుతాధీశు నుపేంద్ర వజ్రన్
- ఉపేంద్రవజ్రాహ్వయ మొప్పునిం పై
యుపేంద్రపుత్త్రా జతజోక్తగాలన్
సపద్మ పద్మా ! జత జల్గగంబున్
ఉపేంద్ర వజ్రాఖ్యము నొప్పు జెప్పన్.
- పురారిముఖ్యామరు పూజనీయున్
సరోజనాభున్ జతజద్విగోక్తిన్
దిరంబుగా నద్రియతిన్నుతింపన్
ఇరాసుతాధీశు నుపేంద్రవజ్రన్.
పోతన తెలుగు భాగవతంలో వాడిన ఉపేంద్రవజ్రము వృత్త పద్యాల సంఖ్య: 1
పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమ)/గుహ్యకులుకృష్ణునిపొగడుట|(భా-10.1-407-ఉపేం.)
తపస్వి వాక్యంబులు దప్పవయ్యెన్;
నెపంబునం గంటిమి నిన్నుఁ జూడన్
దపంబు లొప్పెన్; మముఁ దావకీయ
ప్రపన్నులం జేయుము భక్తమిత్రా!!
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి