16, డిసెంబర్ 2014, మంగళవారం

అమృత భాండం...!!


అమ్మ ఒడిలో ఆటలాడిన బాల్యం
నాన్న చేయి పట్టుకు నడిచిన పసితనం
అల్లరి చేష్టల చిలిపితనం గారాబాల గాంధర్వం
అన్ని కలసి చేసిన సుందర తాండవం
వాగులు వంకలు పోటి పడగా
చెట్టులు పుట్టలు సాయంరాగా
సూర్యునితో చెమక్కులు
చంద్రునితో సాయంకాలాలు
చెట్టా పట్టాలేసుకు తిరిగిన చిన్నతనం
గడచిన జ్ఞాపకాల మధుర నాదం
మళ్ళి మళ్ళి కావాలనిపించే రసరమ్య గీతం 
వయసు మీరినా మదిలో చెక్కు చెదరని శిల్పం
కథలు కథలుగా నినదించే అద్భుత కావ్యం
మరలి రాని వసంతం మాయమైన పసిడితనం
అమ్మ కొంగును వదలని అమృత భాండం...!!2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Malalapragada Rama Krishna చెప్పారు...

తలచు
పిల్లను చూసి తన్ను తాను మరచు
ముద్దు లలో మనసు మై మరచు
కన్న బిడ్డ ముందు అందర్నీమరచు
తల్లి ప్రేమ ఆ బ్రహ్మ కూడా తలచు

Malalapragada Rama Krishna చెప్పారు...

తలచు
పిల్లను చూసి తన్ను తాను మరచు
ముద్దు లలో మనసు మై మరచు
కన్న బిడ్డ ముందు అందర్నీమరచు
తల్లి ప్రేమ ఆ బ్రహ్మ కూడా తలచు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner