21, డిసెంబర్ 2014, ఆదివారం

ఏక్ తారలు..!!


18/12/14
1. రాలుతున్న పొగడబంతులు_అందుతున్న నీ ఆనవాళ్ళు
2. సంక్రాంతికి సీతమ్మ జడబంతి వాకిట్లో _నీ సిగలో ముద్దులొలికే ముద్దబంతి
3. రెప్పచాటు స్వప్నాలన్నీ_నిన్నే చేరాలని పరితపిస్తూ
4. కలల వరదలో_నిదుర దూరమై కంటినిండా నీరూపే
5. సైకత మూర్తిగా మిగిలా_రాలుతున్నఆ రేణువుల్లో నీ జ్ఞాపకాలను దాయలేక
6. గమకాలూ తెలియని రాగాలు_నీ మది మౌనాలకు మాటలు నేర్పే గులాములౌతూ
7. మరువం అలిగింది_తన పరిమళం నువ్వు కాజేసావని 2
8. ముక్కనుమ ముక్కెరతో_మెరుస్తోంది నీ నాసిక వెలుగులీనుతూ 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner