31, డిసెంబర్ 2014, బుధవారం

ఏక్ తారలు...!!

29/12/14
1.  నా మౌనంలో_నీతో మెదిలిన మన జ్ఞాపకం అలజడి రేపుతోంది 
2. నీతో పంచుకున్న జ్ఞాపకపు అనుభూతి_వేల జన్మలకు నాతోనే చేరింది 
3. మౌనం మాట్లాడేస్తోంది_నీ జ్ఞాపకపు అనుభూతిలో పరవశించినందుకేమో
4. అక్షరాలతో ఆట మొదలైంది_మదిలోని భావాలను వెదజల్లుతూ 
5. అక్షర కత్తుల పదునులో_మెరుస్తున్నాయి భావాలు చురుకుగా 
6. కనులలో నీ రూపం_కన్నీళ్ళలో జారిపోతుందని 
7. నీ ప్రేమలో మునిగిన నా కన్నీళ్ళకు_అమృతపు రుచి తెలిసిందనుకుంటా 
8. గల గలలాడే నయాగరాకు ఏం తెలుసు_నీ మువ్వల సవ్వడి తనలో చేరిందని 
9. నీ మదిలో నేనుంటే_కనుచూపు మేరలో వెదుకులాటలేల 
10. నా ఊపిరే నీవైతే_నిను వీడి బతికేదెలా 
11. జ్ఞాపకాల ప్రవాహానికేం ఎరుక_నా ప్రేమ ప్రవాహమే అలా జాలువారుతోందని

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner