నాదైన నా చిన్ని ప్రపంచాన్ని కూడా ఎందుకో నాకు లేకుండా చేయాలని చూస్తున్న ఈ మనుష్యుల్లో కొందరు నాకు నచ్చటం లేదు... అలా అని నేనెవరి జోలికి వెళ్ళకపోయినా మరి ఈ సమస్య ఎందుకు తలెత్తుతోందో... నేను రమ్మని అనక పోయినా హడావిడిగా ఏదో పని ఉన్నట్టు వచ్చేసి అది ఇది వాగేసి వెళిపోతే ఎలా... అసలు మన సంగతే పట్టించుకోకుండా నోటికి ఏది అనిపిస్తే అది మాట్లాడేసి వెంటనే వెళిపోతారు... వాళ్ళకు వేరే పని ఉండదేమో మరి... ఇలా అందరి జీవితాల్లోకి తొంగి చూడటమే పనిగా పెట్టుకున్నారేమో.... స్నేహం అంటూ వస్తారు వరుసలు, బంధుత్వాలు కలుపుతారు... సరే అక్కడితో ఆగుతారా అంటే అదీ లేదు.... పెత్తనాలు చేస్తారు... మరికొందరు వారి వయసుకు విలువ ఇవ్వాలో లేదో తెలియకుండా చేస్తూ ఉంటారు.... సమయం సందర్భం లేకుండా వారికి ఖాళీ అయినప్పుడు మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు... ఇవతలి వాళ్ళ సంగతి చూడరు... ఏదైనా సందర్భం ఉంటే మాట్లాడవచ్చు కాని రోజు మాట్లాడటానికి ఏం ఉంటుంది చెప్పండి... అనవసరంగా మన ముచ్చట కోసం ఎదుటివారి సమయాన్ని మనం తీసుకోవాలనుకోవడం ఎంత వరకు మంచిది... కాస్త ఆలోచిస్తే బావుంటుంది కదూ... నాకైతే నా ప్రపంచంలోనికి నా అనుమతి లేకుండా ఇలా ఎవరెవరో వచ్చి పోవడం అస్సలు నచ్చడం లేదు నేస్తం... ఏం చేయమంటావు...?? సమాధానం చెప్పవూ... నీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాను....
నీ నెచ్చెలి...
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి