26, డిసెంబర్ 2014, శుక్రవారం

వలచిన మది....!!

వలచిన మది వలదన్నా నిను వీడనంటోంది
వలపు వాకిలి తీయరాదటే  సఖియా నా చెలియా
వయ్యారమొలికే వాలుజడతో హొయలొలికిస్తూ 
వద్దన్నా వెంటపడి  వంపుల సొంపుల నడకలతో మదిని దోచి
వధువుగా దరి చేరి జతగా చేరువై నను వీడలేనంటు
వగలు పోతున్న ఆ సోగ కళ్ళలో జాలువారుతున్న
వన్నెచిన్నెల అందాలు విసిరే మెరుపుల మైమరపులు
వర్ణింప తరమా... నిను విడచి ఉండుట సాధ్యమా....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner