మనసు గాయాలను కూర్చి
మదిలో జ్ఞాపకాలను పేర్చి
శిలాక్షరాలు చెక్కాలని తపనతో
పదాల పదనిసలతో పోటి పడుతూ
స్వరాల సరిగమలను చేరదీసి
భావ రాగాన్ని ఆలపించే తరుణాన
ఏవో కొన్ని వికృత స్వరాల అవహేళనలు
సమిష్టిగా చేరి గొంతు నొక్కాలని చూస్తుంటే
శరాలను సంధించక మౌనంగా చూస్తూ
అక్షరాయుధం ఊరుకుంటుందా...
కత్తుల కలాన్ని విదిలించి
చురకత్తుల శులాలను వదలక
చేవచచ్చి జీవశ్చవమౌతుందా...
క్రోధాన్ని జ్వలింపచేసే అగ్ని కణమై
భగ భగ మండే నిప్పుల కొలిమిలో
సమిధగా మారి పరాన్న జీవుల
పాలిట శాపమై యుద్దానికి సన్నద్ధమై
విజయ భేరి మ్రోగించి శత్రువుల గుండెల్లో
చిరస్థాయిగా నిలిచే మహోజ్వలిత తేజమే
త్రిశూల నాదం అదే ఈ సున్నితాక్షరం ..!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి