18, డిసెంబర్ 2014, గురువారం

ఏక్ తారలు.....!!

17/12/14
1. నీవద్దనే ఉన్న నా మది_వదలి పోలేనని మారాం చేస్తోంది
2. మౌనాలు అల్లాడుతున్నాయి_నీ పలుకుల రాశులు అందక
3. మనసులో అలజడి ఎందుకో_నీ జ్ఞాపకాలు తాకుతుంటే
4. నన్ను నేనే వదిలేసాను_నువ్వు వద్దనే నేను నాకూ వద్దనుకుంటూ
5. కలతలకు నెలవుగా మారింది_కలలోని నీ రూపు కనుల ఎదుటకు రాక
6. కడలి అంచున కావ్యాలు_నాతో నీ గురుతుల అలల కవ్వింతలు

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner