క్షణిక కోపావేశాలకు తార్కాణాలు
మారిన ప్రణయ నిర్వచనాలు
మోదంలో ఖేదాన్ని చూపించే మృగ తృష్ణలు
పసిడి జీవితాన్ని పావులుగా చేస్తూ
కాలరాస్తున్న కాలపాశాలుగా
ప్రేమ మైకంలో కళ్ళు లేని కబోదులుగా
యమ కింకరులైన ఉన్మాదులు
పసుపు పారాణి పండంటి జీవితాన్ని
యాసిడ్ దాడుల కాలిన దేహంగా
కన్న కడుపులకు వేదన మిగిల్చే
కసాయి చేతులు నేలరాలేదెన్నడో...!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి