చెలిమిని వీడిన క్షణం మదిని మరపించిన గతం
గాయమైన జ్ఞాపకంగా చేరిన
గురుతుల దొంతరలు ఎక్కడో...
దగ్గరైన మౌనంలో దాచిన అలకలు
వదలిన ఏకాంతానికి ఆభరణాలై
చెదిరిన మదిలో చేరువైన
వెన్నెల కెరటాలుగా స్పృశిస్తే...
పంచుకున్న మమతల పలకరింపులు
పారిజాత పరిమళాలుగా వదలిపోకుంటే
ఎటు వెళ్ళలేని అక్షరాలు ఇలా ఒనగూడి
ఒద్దికగా అమరిపోతున్నాయి చిత్రంగా....
కలల ఒడిలో అలసిన హాయి
కడలిని చేరిన కన్నీటి కెరటాలై
నిను చేరని నిరాశ్రయ గీతికలుగా
విలపించే హృది రాగాలుగా చేరుతున్నాయి....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి