17, డిసెంబర్ 2014, బుధవారం

ఏక్ తారలు....!!

16/12/14
1. వలచిన కాంతుడే .... వలదన్న వయ్యరాల వలపుల వన్నెలాడి నిలచునే
2. .తలపులు తల్లడిల్లుతున్నాయి .... మదిని చేరిన నీ మధుర జ్ఞాపకాలతో
3. పసితనం పలుచబడింది... అమ్మానాన్నలను మరచిన ఆంగ్ల ధాటికి
4. గురుతుల గొంతులు వినపడుతూనే ఉన్నాయి_విరహాల వియోగాన్ని దూరం చేస్తూ
5.  మల్లెల మందారాలే_నీ స్నేహానికి దాసోహమంటూ
6. గ్రీష్మ తాపాన్ని తగ్గించాలని_వరుణుడి తహ తహలు 
7రెప్ప వేయనేలేదు_యుగాల చెలిమి చెంత చేరిందని 
8. భారం ఖేదమైంది_తలపులు తల్లడిల్లి 
9. మౌనపు అలజడులు మాటాాడాయి_నీ తలపుల తాకిడికి
10. అలుకకు ఉలుకు_నీ చెంతన నే ఉన్నానని
11.  మాటలు మరచింది_ మౌనాలు అలుక మానక
12. సాన్నిహిత్యం చేరువైతే_తలపులకెందుకు తహ తహ
13. గురుతులకు నెలవు _కమ్మని నీ చెలిమి
14. రమ్మంది దరిచేర_ఆత్మీయ పలుకు
15. చెలిమిని చేరిన జ్ఞాపకం_శ్వాసగా మారిన క్షణం
16. నువ్వు మౌనాన్ని వదిలేసావని _ఏకాంతానికి అంత కోపం 
17. కలలో మిగిలే ఉన్నాగా_కథగా మారి  
18. మనసు చూపించేది నన్నేగా_కళ్ళలో వేరొకరేలా....   
 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner