2, డిసెంబర్ 2014, మంగళవారం

ఏక్ తారలు...!!

1. ఉలికి పడకే కలికి చిలకా_నీతో నా మది ఉసుల అలజడికి
2. ఊగిసలాడుతోంది నా ఎద_ఉత్తుంగ నీ ప్రేమ తరంగ తాకిడికి
మనసు వియోగం గమ్యం
3. వియోగం బాధగా ఉంది_నా మనసు నీదని తెలిసాక
4. గమ్యం కోసం ఆరాటపడ్డా_నా మనసు  గమ్యస్థానం నీవని తెలియక
5. మనసు గమ్యాన్ని నిరోధించలేక పోయా_వియోగ వేదన అలజడి తాళలేక
6. అలల కడలిలో అలజడి ఎందుకో_కలల తీరాన్ని చేరాలన్న తపనలో
7. చుక్కల చాటున చేరావెందుకు_మబ్బుల పరదా కప్పుకుని
8. అనుభూతి ఆలంకృతమైతే_అక్షరాలకు పరిచయమెందులకు

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner