4, డిసెంబర్ 2014, గురువారం

భావావేశం...!!

నేస్తం...
         ఏంటో రోజులు మరీ ఇలా మారిపోతున్నాయి... మనం చేయం, ఎదుటివాళ్ళు చేస్తే మెచ్చుకోనులేము.. మరీ  ఇంత సంకుచిత్వమా మనలో... మనం ఒకరిని మనస్పూర్తిగా మెచ్చుకోలేము.. మనని వాళ్ళు మెచ్చుకున్నా ఒప్పుకోలేక బోలెడు ప్రశ్నలు మనలో.. అంటే మన మీద మనకి నమ్మకం లేకపోవడమా లేక ఎదుటివారిలో తప్పులు వెదికే మన నైజం మార్చుకోలేక ఈ సందిగ్ధమా... నేను చాలా సార్లు గమనించాను ఏదైనా ఒక పోస్ట్ కి స్పందన రాస్తే కొంతమంది కృతజ్ఞతలు / ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది.. నేను అంతే అనుకో... కాకపొతే ఇక్కడ సమస్య ఏమిటంటే కొన్నిటికి ఆ పోస్ట్ ని బట్టి స్పందన రాస్తూ మరికొన్నింటికి బావుందనో లేదా చాలా బావుందనో రాస్తూ ఉంటాము... దానికి కూడా ఎందుకు ఇలా రాశారు అంటే సమాధానం ఏం చెప్పాలి... కొందరు రాసే భావాలు వెంటనే వాటికి తగ్గట్టుగా స్పందన రాయాలి అనిపిస్తుంది... మరి కొన్నింటికి రాయడానికి మాటలు చాలవు.. ఇంకొన్ని బావుందనో లేదా చాలా బావుందనో ఆ సమయానికి ఆ పోస్ట్ చదివి స్పందన ఉంటుంది.. దానికి కూడా ఎందుకు..?? ఏమిటి..?? అని ప్రశ్నలు సంధిస్తే ఏమని చెప్పాలి... చాలా మంది ఇలా అడిగే వాళ్ళు కనీసం ఒక్కరి పోస్ట్ కి కుడా తమ స్పందన తెలియచెప్పరు .. వాళ్ళ వందల  కొద్ది పోస్ట్ లకి స్పందన తెలిపిన వారిలో కనీసం ఒక్కరి పోస్ట్ కి కూడా బావుందని రాయరు... అందరిలో ఉన్న కొద్దో గొప్పో భావుకతను అభినందించాలి అన్న చిన్న ప్రక్రియ ఈ స్పందన... రాసిన ప్రతి ఒక్కరికి వాళ్ళది చిన్న రచన అయినా, గొప్ప రచన అయినా స్పందనల రూపంలో అందరి అభిమానాన్ని అందుకోవాలని ఉంటుంది.. ఆ ప్రశంస చిన్నది కావచ్చు, విశ్లేషణాత్మకంగా ఉండొచ్చు, సద్విమర్శ కాని మరేదయినా కాని ఇలా ప్రతి స్పందన ఉంటే రాసిన వారికి చెప్పనలవి కాని సంతోషం... నా పాటికి నేను పోస్ట్స్ చదువుతూ కామెంట్లు పెట్టుకుంటూ వెళిపోతాను... కనీసం రాసిన వాళ్ళ పేరు కూడా పట్టించుకోను ఎక్కువగా ... వాళ్ళు నాకు కామెంట్లు పెట్టారా లేదా అని కూడా చూడను... నేను కామెంట్లు పెట్టని వారు చాలా మంది నా పోస్త్ల్స్ ఇష్టపడి తమ స్పందనలు తెలియచేస్తూ ఉన్నారు... ఈ విధంగా వారందరికీ నా కృతజ్ఞతలు... సమయాభావం వల్ల చాలా మందికి నేను స్పందనలు తెలియచేయలేక పోతున్నాను... అందుకు క్షమించండి.. నేను కామెంట్లు పెట్టే చాలామంది నా పోస్ట్స్ కనీసం చూడరు, ఇష్టపడరు.. దానికి నేను మాత్రం ఏం చేస్తాను నచ్చలేదు అని సరిపెట్టుకుంటూ ఉంటాను... మనం చూసిన పోస్ట్స్ కి చాతనైతే ఓ చిన్న స్పందన తెలియచేస్తే రాసిన వారి ఆనందాన్ని వెలకట్టలేము.. ఇది నిజం.. మన సంతోషం ఎలాంటిదో ఎదుటివార్ సంతోషం కూడా అలాంటిదే అనుకుంటే చాలు.. అంతే కాని బాగుందని ఎందుకు పెట్టారు... దాని అ అర్ధం ఏంటి... వగైరా వగైరా ప్రశ్నలు వేయక మనము ఎదుటి వారి భావాలను గౌరవిద్దాం చాతనైతే లేదా దూరంగా ఉందాం నచ్చకపోతే ... అంతే  కాని ప్రశ్నలతో వేధించవద్దు.. ఏంటి నేస్తం ఈ కబుర్లు అనుకుంటున్నావా... నా భావాలను భరించేది నువ్వైనప్పుడు వేరెవరితో చెప్పుకుంటాను చెప్పు... ఎప్పటికి మారతారో ఇలాంటి వాళ్ళు అని ఎదురుచూస్తూ...
ఉండనా మరి...
నీ నెచ్చెలి..

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner