11, డిసెంబర్ 2014, గురువారం

ఏక్ తారలు...!!


10/12/14
1. నేనే నువ్వయ్యానుగా_నీ నా ఎందుకింక
2. నీలోనే చేరిన నేను_నా కోసం నేనుగా మిగలని క్షణాలు
3. వేల జన్మలకైనా వేచి ఉంటా_ఓ క్షణం నీ చెలిమి కోసం
4. నిశిని చుట్టేసిన వెన్నెల_నీ రాకను నాకు తెలియచేస్తూ
5. జ్ఞాపకాల గతాలు అలిగి వెళ్ళిపోయాయి_వాటికి నువ్వు అందలేదని
6. ఓ క్షణం ఆదమరచా_అక్షరాలు అటు ఇటు వెళ్లి పోయాయి
7. నీ గుండె గూడు ఇరుకుగా ఉంది_నా జ్ఞాపకాల పేజీలు ఎక్కువై
8. విరహంలో అన్ని నా గురుతులేగా_ నిను వదిలింది ఎక్కడ
9. చుక్కల పక్కన చోటిస్తా_మబ్బుల దుప్పటి దాచేసి నీతో ఉండనిస్తావా
10. ఆలశ్యమెందుకు_వెనక్కు చూడకుండా వచ్చేయ్
11. కలువలకు దూరం ఎక్కువే_చెంతనే తారలుండగా చూపులు మరలునా
12. తారల మెరుపుల ముందు దిగదుడుపే_కలువల అందం ఎంతున్నా
13. తప్పడం లేదు మరి_కాంతలకు దాసోహం అనక

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner