14, డిసెంబర్ 2014, ఆదివారం

ఈ గమనం.....!!

కలగా వచ్చి మెల్లగా మదిలో చేరి
మాయలు చేసిన జాణతనం
వెన్నెల పాటలు అల్లరి ఆటలు
చేసిన చిలిపితనపు భావ వల్లరి
మరపు రాక ముందే దూరమై
తనివి తీరని జ్ఞాపకంగా మిగిలిన క్షణం
గాయాన్ని రేపినా గుండెను ఛిద్రం చేసినా
వదలలేక వెంటపడుతున్న బాంధవ్యం
ఎందుకో ఈ ఆరాటం మనసుకి
వద్దన్నా ఊరుకోలేని ఎద పోరాటం
క్షణాల ఆంతర్యం యుగాల చైతన్యం కోసం
ఎదురు చూపుల నిశీధిలో ఎక్కడా కనిపించని
వెలుగు రేఖల దాఖలాల కోసం
నిరంతరం ఈ గమనం....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner