8, డిసెంబర్ 2014, సోమవారం

ఏక్ తారలు...!!

06/12/14 
1. చూసి చూసి సొలసాయి మది చూపులు_కనుచూపు మేరలో నీ జాడ కానరాక
2. వేసవి నిట్టూర్పులు సందడి చేశాయెందుకో_నీ రాకను పసిగట్టాయనుకుంటా
3. దూరం ఎక్కువై వాడిపోతాయేమో_ అసలే పారిజాతాలు బహు సుకుమారం సుమా
4. మల్లెల మనసు ముందే తెలిసినట్లు ఉంది_అందుకే చైత్రాన్ని దాటేసింది
5. తరలిరాని వసంతాన్ని వెంట తెచ్చాయి_ నీ శిశిరపు హొయలు
6. శరత్తు సంతకాలు చేసేసింది_హేమంతానికి చోటిస్తూ
7. ఛివురులు తొడిగిన చెలి అందాలను చూసి_వసంతం తో స్నేహం చేద్దామనుకుంది పాపం శిశిరం
8. చెలి కోసం హేమంతాన్ని దాటేసినా_శిశిరానికి తప్పని వాసంతపు అగచాట్లు
9.  గ్రీష్మ తాపానికి వర్షానికి వేవిళ్ళట_వసంతం వచ్చెళ్ళాక
10. లేఖలో ప్రేమ_మనసుని తాకిందేమోమరి
11. నిన్ను చూసాక మాటలు రాక మౌనమయ్యా_ఊసులన్ని నీ కళ్ళలో కనిపిస్తుంటే
12. నీ రాకేమో అని సంబరపడ్డా_పైరగాలి మోసుకొచ్చిన పరిమళానికి
13. నీ పద సవ్వడికే_అందెల రవళి అలిగింది
14. అడుగులతో జత కట్టినా_అందెల అందం తగ్గునా
15. నింగిలో తారలు అల్లరిగా నవ్వాయి_ధాత్రికి ధీటుగా నిల్చిన నీ సోయగాలకు
16. లక్ష లేకపొతే చెప్పు_లక్షణంగా మరో దారి చూసుకుంటా
17. ఇక వసతాన్ని వదిలెయ్యరాదూ_గ్రీష్మానికి కోపం వచ్చినట్టుంది
18. చివురించే ఆశలకు చిరుదీపాలు_వేకువ వెన్నెలలే కదా
మల్లెల మందారాలే
నీ బుగ్గల కెంపుల మోగ్గలౌతూ

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner