18, డిసెంబర్ 2014, గురువారం

కొన్ని జీవితాలు ఇంతే....!!

నేస్తం....
      జీవితం అంటే తీపి చేదు నిజాల సంగమంలో చేదు పాలు ఎక్కువని అని తెలిసే సరికి మూడు వంతుల జీవితం గడిచిపోయింది... ఆటు పొట్ల ఎత్తిపోతలలో గడుస్తూనే...ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ సాగిపోయింది... మంచో చెడో నమ్మిన పాపానికి నట్టేట ముంచినా మనిషిలో మరో కోణాన్ని చూపినా తట్టుకుంటూ... ఏమి ఎరుగని అమాయక జీవి ఒంటరితనానికి నేస్తంగా మారి.... కాలానికి ఎదురీది పయనాన్ని ఓ కొలిక్కి తేవడానికి పట్టిన సమయం ఓ జీవిత కాలం అంటే నమ్ముతావా.... ఇప్పటికి అర్ధంకాని జీవితమే ఇది... ఎప్పటికి అర్ధం కాదేమో.... ఇన్నాళ్ళుగా మంచికి చెడుకి రాని బంధుజనం ఒక్కసారిగా ప్రేమను పంచుతుంటే నమ్మకానికి తగిలిన దెబ్బలకు లేపనం అనుకోవాలో... లేక మొదటి నాటకానికి మారిన ఘట్టంగా అనుమానించాలో తెలియని పరిస్థితి... అసలేమో మన బంగారమే మంచిది కాదాయే... ఇక ఎవరిని అనుకుని ఏం ఉపయోగం చెప్పు... అహానికి ఓ హద్దు ఉంటుందని ఇన్నాళ్ళుగా నమ్ముతూ వచ్చిన నాకు ఆ హద్దు దరిదాపుల్లో కనిపించక... ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేక నలుగుతున్న మనసుకి సర్ది చెప్పడం చేత కావడం లేదు... కల్మషమెరుగని మనసుతో ఆడుకున్న ఈ నాటకంలో ఎటు కాని పావుగా మిగిలిపోయిన ఈ జీవితానికి చివరి అంకానికి రంగం సిద్దమైందని తెలియని ప్రాణం కొట్టుకుంటోంది తను మారాలా లేక మార్పు లేని మనసుని మనిషిని మార్చుకోవడానికి ఇంకా ప్రయత్నించాలా అని... మార్పు కోసం  ఎదురు చూస్తూ ఈ జీవిత కాలం సరిపోవడం లేదని సరిపెట్టుకోవాలో తెలియని సందిగ్ధానికి తెర తీసే ఉంది ఈ నాటకంలో.... ఏంటి లేఖలో భావాలు బాగా బరువుగా ఉన్నాయంటున్నావా... నీకు తెలియని విషయమేముంది చెప్పు... కొన్ని జీవితాలు ఇంతే మరి... భారంగానే ముగిసిపోతూ ఉంటాయి... సరే మరి మరీ నీకు భారం కాకుండా ఉండటానికి
ఈసారికి ఉంటాను...
నీ నెచ్చెలి...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner