1, డిసెంబర్ 2014, సోమవారం

ఈ కవన కావ్యం...!!

ఆటల పల్లకిలో చేరి
మాటల ముంగిట ఒనగూడి
రా రమ్మని పిలిచే సరాగమే
ఈ ప్రేమ పరాగం

తలపుల తడిలో చేరి
మమతల మేడల జతగూడి
రా రమ్మని పిలిచే నయగారమే
ఈ మధుర రాగం

పలికే స్వరాల సవ్వడిలోకలసి 
విసిరే గాలుల తాకిడిలో నడయాడి
రా రమ్మని పిలిచే ఆహ్వానమే
ఈ వలపు జలపాతం

చూపుల సున్నితాలు చుట్టి
మాపున మనసు మౌనాలు దాగి
రా రమ్మని పిలిచే రాయంచ అందమే
ఈ కవన కావ్యం

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శ్యామలీయం చెప్పారు...

మీరు మన్నించి ఒక్క విషయం చెప్పండి.

కవన కావ్యం అన్న సమాసానికి అర్థం ఏమన్నా ఉంటుందా? కావ్యంలో ఉండేది కవనమే కదా! కవనం ఉండబట్టేకదా కావ్యం అయ్యేదీను? ఇటువంటి వాడుకను సంప్రదాయంగా అతివ్యాప్తిదోషం అని చెబుతారు. (కావ్యదోషాలు మూడు అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవం అని)

ఉదాహరణుకు, "ఆ ఆవుకు తోక ఉన్నది" అనటం అతివ్యాప్తి. అన్నీఅవులకూ ఉంటుంది కదా. అలా గన్నమాట.

చూడండి, ఏదో పాతకాలం ఛాందసం కొద్దీ ఈ‌మాటలు చెప్పాను. అసందర్భం అని మీ విజ్ఞతకు అనిపిస్తే క్షమించండి.

చెప్పాలంటే...... చెప్పారు...

పెద్దలు మీకు తెలిసిన దానిలో కాస్త కూడా తెలియని వాళ్ళం అండి... కావ్యంలో ఉండేది కవనమె అయినా అన్ని కవనాలు కావ్యాలు కాదు కదండీ .. ఆ ఉద్దేశ్యంతో ఇలా అన్నాను ..తప్పయితే మన్నించండి ... ధన్యవాదాలు మీ సూచనకు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner