9, డిసెంబర్ 2014, మంగళవారం

మనం అంటే....!!

నువ్వు నేను కలిస్తే
మనమనే మనసు బంధం
నేనులో సగం నువ్వుగా కలిసావు
నీ నువ్వు లో నేనున్నానా...

జతలో కలసిన మనం
సగం సగంలో చెరి సగం
చివరికి మిగిలిన సగమే
అదే నువ్వు నేను అర్ధ భాగం

మరచిన గతంలో క్షణం
మానని గాయంగా మిగిలిన జీవితం
మొదటి అడుగే మలి సంతకంగా
మారిన మరో గత జ్ఞాపకం చేరిన రోజు

విజయపు పయనానికి చెదిరిన
పావుల మనోగతం చూసిన నేను
గెలుపు మత్తులో అందించిన
ఆసరాను విదిలించిన నీ అహం

తొలి గురుతులు దాచేసి
అభిమానానికి రంగులు పులిమి
వ్యర్ధమైన ఘడియలకు కారణమై
కానట్టు నటించే నీలో సగం నేనైన మనమా....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner