4, మే 2021, మంగళవారం

రాజసూ(కీ) య యాగం..!!

నేస్తం, 
        ప్రపంచమంతా నావైపు చూడాలంటే ఏం చేయాలంటావ్? నెలలు, సంవత్సరాలు ఎదురుచూసేంత ఓపిక నాకు లేదు మరి. క్షణాలో, నిమిషాలో మాత్రమే నా పరిధి. నేనేం ఓఁ డబ్బుల్లో పుట్టి, డబ్బుల్లో పెరగలేదు. అండా, అధికారం నా వెనుక లేదు. మనది ఎర్రబస్ అయినా ఎయిర్ బస్ ఎక్కాలన్నంత ఆశ. పోనీ చదువా అంటే అదీ అంతంత మాత్రమేనాయే. నీకు తెలియనిదేం ఉంది చెప్పు. 
        నాకు చిన్నపాటి జోశ్యం చెప్పడం వచ్చు. గతంలో కాసింత పేరుందిలే. అదేమైనా పనికొచ్చుదంటావా. లేకపోతే రాత్రికి రాత్రి ఓ రాయికి బొట్టెట్టి దేవుడు వెలిసాడంటే పోతుందంటావా. అదీ కాదంటే నాలుగు పుస్తకాల నుండి కాసిని సూక్తిసుధలు బట్టీ కొట్టి నా రాతలుగా ప్రచారం చేయమంటావా. అదీ కాదంటే నాలుగు అక్షరం ముక్కలు రాయడం వచ్చు కనక ఏదోక మతాన్ని కాదు కాదు హిందూ మతాన్నో, హిందూ దేవుళ్ళనో, దేవతలనో, లేదా పురాణాల్లోని పతివ్రతలనో హేళన చేస్తూ రాయమంటావా. క్షణాల్లో సెలబ్రిటీలం అయిపోవచ్చు నిస్సందేహంగా. 
       ఇప్పటి ట్రెండ్ ఏంటంటే నేను రాసేది మాత్రమే నికార్సయిన రాత. నిజాయితీ గల రాత. ఎవరికీ కొమ్ము కాయదు నా రాత...ఇలా ఇంకా చాలా ఉన్నాయిలే. ఆ దారిలో పొమ్మంటావా. ఏంటో నా గోల నాది. కరోనా గోల కరోనాది. రాజకీయం చేయాలంటే ఎన్ని లేవూ...! సరేగాని ముందు కరోనా నుండి బతికి బయట పడ్డాక మన రాజకీయ యంత్రాంగం సంగతి చూద్దాం..!! 
        


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner