10, మే 2021, సోమవారం

కాలం వెంబడి కలం..53

          హ్యూస్టన్ ఎయిర్ పోర్ట్ లో దిగి కో ఆర్డినేటర్ చెప్పిన హోటల్ లో రూమ్ తీసుకున్నాము. వాడికి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసాను. డాక్యుమెంట్స్ అన్నీ రడీగా పెట్టుకుని మరుసటి రోజు ప్రొద్దుట 8 కంతా రడీగా ఉండమని చెప్పాడు. వెహికల్ వచ్చి పిక్ చేసుకుంటుందని చెప్పాడు. మరుసటి రోజు 7.30 కే రడీ అయ్యి కిందకి లాబీ లోనికి వెళ్ళాము. చాలా మంది మాలాంటి వాళ్ళు ఉన్నారక్కడ.ఇండియన్ ఒకావిడ ఫోన్ మాట్లాడుతోంది. ఎందుకో నాకు తెలిసిన వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుందనిపించింది. ఆమె ఫోన్ మాట్లాడటం అయ్యాక అడిగాను. నా గెస్ కరక్టే. నాన్న ఫ్రెండ్ సాంబశివరావు అంకుల్ కూతురు. వాళ్ళాయన వీసా స్టాంపిగ్ కోసం వచ్చారట.  
           మమ్మల్ని కొంత మందిని తీసుకుని వెహికల్ మెక్సికో బయలుదేరింది. అమెరికా, మెక్సికో బోర్డర్ దగ్గర ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మెక్సికో లోనికి ఎంటరయ్యాము. వీసా స్టాంపిగ్ అయితే తప్ప మళ్ళీ అమెరికా భూభాగం లోనికి అడుగు పెట్టలేమన్న మాట. మమ్మల్ని అమెరికన్ ఎంబసి దగ్గర వదిలి వెహికల్ వెళిపోయింది. గేట్స్ ఓపెన్ చేసారు లోపలికి వెళ్ళి కూర్చున్నాము. మమ్మల్ని పిలిచినప్పుడు వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి వీసా స్టాంపిగ్ ముందు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. 
           మా పేర్లు పిలిచి, కౌంటర్ నంబర్ చెప్పిన కౌంటర్ దగ్గరకి వెళ్ళాము. అక్కడ లేడి ఉంది. అడిగిన పేపర్స్, పాస్పోర్ట్స్ ఇచ్చాము. చూసి వీసా రిజెక్ట్ చేసి, అవుటాఫ్ కంట్రీకి వెళ్ళమని చెప్పింది. నాకు కోపం వచ్చింది. పోస్ట్ లో వీసా స్టాంపిగ్ కి పంపితే అవుటాఫ్ కంట్రీకి వెళ్ళమంటేనే కదా ఇక్కడికి వచ్చామన్నాను. పక్క కౌంటర్ లో మరొకావిడతో మాట్లాడి మధ్యాహ్నం రమ్మన్నారు. సరేనని బయటికి వచ్చేసాం. బ్రోకర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాను. మేం బయటికి వచ్చిన కాసేపటికే సాంబశివరావు అంకుల్ అల్లుడు కూడా బయటికి వచ్చాడు. మేం ఫోన్ కలక్ట్ చేసుకున్న చోటికి వచ్చాడు. ఏమైందని అడిగితే మధ్యాహ్నం రమ్మన్నారు. వీసా ఇస్తారో ఇవ్వరో తెలియదన్నాడు. ఇస్తారులెండి, మీరు కంగారు పడవద్దని చెప్పాము. మేం మళ్లీ లోపలికి వెళితే రేపు రమ్మన్నారు. అంకుల్ వాళ్ళ అల్లుడి ఫోన్ మా దగ్గర ఉండిపోయింది. నైట్ చాలా సేపు ఉన్నాము. ఇంకా రాలేదని మేము మెక్సికోలో హోటల్ లో రూమ్ తీసుకుని అక్కడికి వెళ్ళాము. ఎప్పటికో బ్రోకర్ కాల్ చేసి,వచ్చి ఫోన్ తీసుకువెళ్ళాడు. మరుసటి రోజు కూడా ఇదే తంతు. మధ్యాహ్నం రండి, తర్వాత రేపు రండి అని పంపేసారు. మీకు లాయర్ ఉన్నారా అని అడిగారు. లేరు కంపెనీ లాయర్ మాత్రమే ఉన్నారని చెప్పాను. AMSOL సుబ్బరాజు కి, లీగల్ వ్యవహారాలు చూసే బాల ఇటికిరాలకి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు విషయం చెప్తూనే ఉన్నాను. హోటల్ వాళ్ళకి సరిగా ఇంగ్లీష్ రాదు. మనకేమెా స్పానిష్ రాదాయే. ఏదో ఓలా, కోముస్తాస్ వంటి కాసిని పదాలే తెలుసాయే. 
ఆ టైమ్ లోనే నాకు జాబ్ కి ఇంటర్వ్యూ వచ్చింది. టెక్నికల్ ఇంటర్వ్యూ ఫోన్ లోనే ఆన్సర్ చేసాను. సెలక్ట్ అయ్యాను కూడా. నేను AMSOL తో పని చేసినన్ని రోజులు నా ప్రాజెక్ట్స్ నేనే చూసుకున్నాను. AMSOL లో చాలా మందిని జాయిన్ చేసాను కాని ఎప్పడూ ఒక్క డాలర్ కూడా తీసుకోలేదు. నాకు డబ్బులు సరిగా ఇవ్వకపోయినా ఏం అనలేదు. 
          రెండు రోజులయిన దగ్గర నుండి మా ఆయన టార్చర్ మెుదలయ్యింది. ఏదో నా తప్పు వలన వీసా ఇవ్వనట్టుగా. ఐదో రోజు లోపల రూమ్ లోనికి పిలిచి నా డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ చూసి చాలా ప్రశ్నలు అడిగారు. ఇండియా నుండి వచ్చింది మెుదలు అంతా ఎక్స్ ప్లెయిన్ చేసాను. ఆఖరికి C1 వీసా ఇస్తామని చెప్పారు. నేను ఆవిడని యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ అనేసి బయటికి వచ్చేసాను. నిజంగా ఐదు రోజులు ఎంత నరకమమటే అంత నరకం. మెారల్ సపోర్ట్ లేదు. కంపెనీ నుండి హెల్ప్ లేదు. ఆఖరికి నా వీసా ప్రాసెస్ అయ్యాక లాయర్ ని పంపించమా అని అడిగారు. నిజంగా అమెరికన్ ఎంబసిలో కొందరు వేరే దేశాల వాళ్ళని కుక్కల కన్నా హీనంగా చూస్తారు. 
నెల రోజులకు C1 వీసా తీసుకుని బయటికి వచ్చి, మెక్సికోలో మందు షాపింగ్ చేసాం. 2 బాటిల్స్ తకీలా వేరే అబ్బాయిని తీసుకుని వెళ్ళి తీసుకున్నాం. మెక్సికో బోర్డర్ దాటి హ్యూస్టన్ లో మళ్లీ అదే హోటల్ కి వచ్చి, మరుసటి రోజు ఫ్లైట్ లో హంట్స్విల్ చేరుకున్నాము. 
        అప్పటికే C1 వీసా ఇస్తే ఏం చేయాలో లాయర్ తోనూ, నాకు తెలిసిన వాళ్ళందరితోనూ మాట్లాడాను. బాలా తో కూడా మాట్లాడాను. నాకు మెుదటి నుండి జరిగిపోయిన దాన్ని గురించి పెద్దగా ఆలోచించడం అలవాటు లేదు. నెక్స్ట్ ఏం చేయాలని చూసుకుంటాను. నాకు గ్రీన్ కార్డ్ కి ఫైల్ చేసిన I 140  పనికిరాదు అమెరికాలో ఉండటానికి. I 485 ఫైల్ చేయాలి అదీ నెల లోపల. I 485 ఫైల్ చేయడానికి లేబర్, I 140 క్లియర్ అయ్యి కట్ ఆఫ్ డేట్ ఎవైలబుల్ ఉండాలి. C1 వీసా ఎక్స్పైర్ అయ్యే లోపల ఫైల్ చేయాలి. మామూలుగా అయితే C1 వీసాతో I 485 ఫైల్ చేయకూడదు. రాఘవేంద్ర ఫ్రెండ్ ఉదయకుమార్ తనకు తెలిసిన కంపెనీతో మాట్లాడి I 485 ఫైల్ చేయించడానికి అవసరమైన పేపర్ వర్క్ అంతా పంపమన్నారు. ఆ కంపెనీకి అప్పటికే మంచి పేరు లేదు. కాని తప్పదు మరో ఆల్టర్నేట్ లేదు. మెుత్తం పేపర్స్ అన్ని రడీ చేసి C1 వీసా ఎక్స్పైర్ అయ్యే ముందు పంపుదామని పోస్టాఫీస్ కి వెళ్ళి పోస్ట్ చేసి ఇంటికి వస్తుంటే, బాలా ఫోన్ చేసి మెుత్తం పేపర్స్ సెట్ AMSOL కి కూడా పంపమన్నారు. మళ్లీ పోస్టాఫీస్ కి వెళ్ళి ఆ పేపర్స్ అన్నీ AMSOL కి పంపాను. సరిగ్గా రేపు C1 వీసా అయిపోతుందనగా మాకు I 485 కి ఫైల్ చేసినట్టు రిసిప్ట్ వచ్చింది. ఫోన్ చేసి చెప్పాను. మీకు స్టేటస్ ప్రోబ్లం ఏమీ ఉండదులెండి అని బాలా చెప్పారు. తర్వాత I 485 కి ఫింగర్ ప్రింట్స్ కి ఇంటర్వ్యూ వచ్చింది. తర్వాత I 485 డాక్యుమెంట్ వచ్చింది. బాలాకి చెప్పగానే ఇక మీకు ఇబ్బందేం లేదు లెండి అని చెప్పారు. 

" ఇబ్బంది అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. తట్టుకుని నిలబడటంలోనే మనమేంటన్నది తెలుస్తుంది. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner