4, మే 2021, మంగళవారం
ఏక్ తారలు...!!
1. అనుసరిస్తూనే ఉన్నా_అనుకరణకు అర్థం లేదని తెలిసి..!!
2. చేయందిస్తూనే ఉంది మానవత్వం_అరకొరగా అక్కడక్కడా నేనున్నానంటూ...!!
3. అడపాదడపా పలకరిస్తూనే ఉన్నా_మర్చిపోతావేమెానని..!!
4. తప్పని బతుకు పోరాటమిది_బాధ్యతలకు బానిసౌతూ...!!
5. పలకరిస్తూన్నాయి పెదవులపై చిరునవ్వులు_బాధకు ఓదార్పుగా...!!
6. గమనమెప్పుడూ గమ్యం వైపుకే_కన్నీరు పన్నీరు తప్పనివంటూ..!!
7. జీవనసంద్రానికి అలవాటే ఆటుపోట్లు_కర్మసాక్షి గమనంలా...!!
8. నిర్ణయించేది కాలమే_ఈ సృష్టిని శాసిస్తూ...!!
9. తత్వమేదైనా సరైనదే_మనసు తూకం నిర్మలమైనదైతే..!!
10. శ్లోకానికి మూలం శోకమే_కాలానిదెప్పుడూ ఒంటరి పయనమే..!!
11. మనిషితనానికి ప్రతీకలే అందరు_జవాబుదారీతనం లేకుండా మసలుతూ..!!
12. తప్పిపోవడం కాదది_చిరునామా సరిగా రాయలేదట..!!
13. ఆ ప్రయత్నంలోనే ఉన్నా_తప్పించుకోవడం తప్పనిసరని..!!
14. అనుభవాలతో అసువులు ఉండవు_సమయానుకూలమే విధిరాతగా..!!
15. మాట ఎప్పుడూ మనసులోనిదే_అలుపు లేని అక్షరాలుగా...!!
16. చింతల సంతోషాన్ని ఆస్వాదిస్తున్నా_చింతనలో సాంత్వన అందుకుంటూ... !!
17. అనునయిస్తుంది అక్షరం_అలసట తెలియకుండా...!!
18. ఈ జన్మకు తేడా తెలుసుకోలేరు వారు_శాసనానికి చెరగని ప్రేమకు..!!
19. అనుభవ సారం అందిస్తున్నా_మరో తరానికి పాఠాలుగా పనికివస్తాయని..!!
20. బంధువులే అందరూ_అపరిచితంగా మారిన పరిచయస్తులుగా...!!
21. ఓటమి కాదది_అతి నమ్మకంతో జరిగిన నష్టమనుకుంటా..!!
22. ఎద్దేవలెక్కువయ్యాయి_చేతగానితనమని వంకర నవ్వులు నవ్వుతూ...!!
23. భవిష్యత్తుకు భరోసానే ఇది_గతమిచ్చిన ఆసరాతో..!!
24. వెలితి పడుతోందో మనసు_గతంలోనూ గమనంలోనూ లేననుకుంటూ..!!
25. ఊరటనిస్తోందో తీరం_ఏకాంతాన్ని చదువుకోమంటూ..!!
26. ఉనికినే తానవుతానంటోందిక_ఏకాంతానికి అక్షరాలను అనుసంధానించమంటూ..!!
27. ఎక్కువ తక్కువదేముంది_మనల్ని మనం గుర్తెరిగితే చాలు..!!
28. కాలం కనికరం చూపుతోంది_నిన్నటిలో చేసిన తప్పులను తెలుసుకొమ్మంటూ...!!
29. కవనమౌతోంది అక్షరం_కలత పడిన మనసుకు ఊరటనందిస్తూ...!!
30. కాలం చెప్పిన కథలెన్నో_మనసు చరిత్రను విప్పుతూ...!!
వర్గము
ఏక్ తార
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి