12, మే 2021, బుధవారం

భాషా ప్రావీణ్యం..!!

అబ్బాయ్, 
      నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా స్క్రిప్ట్ చూసి కూడా సదవడం రాకపోతే ఎలాగురా! అసలు మనకి కనీసం ఓ బాసన్నా సరిగా వచ్చా? రాదా? ఆ సంకర బాషేంటిరా బాబూ. అసలే గౌరవప్రదమైన పదవిలో ఉండి ఓ ప్రాంతీయతకు ప్రతినిధిగా ప్రపంచం చూస్తోంది. పరువు తీయకు. దయచేసి మాట్లాడేది ఓ ముక్కయినా తప్పుల్లేకుండా స్పష్టంగా ఒకే భాషలో మాట్లాడు. అది ఇంగ్లీషయినా, తెలుగయినా, హిందీ అయినా మరో ఇతర భాషయినా పర్లేదు. 
       తమరికి స్క్రిప్ట్ రాసేవారిది ప్రోబ్లమా లేక చూసి సదవలేకపోతున్న మీదా ప్రోబ్లం. సాదా పదాలు పలకలేమూ, అలాగని విష్వక్సేనుడు లాంటి నోరు తిరగని పదాలూ మనకు పలకడం రాదాయే. మరో 10 ఏళ్ళు మీదే అధికారం కావచ్చు, కాకపోవచ్చు. సమస్య అది కాదు. మనం ఓ గౌరవప్రదమైన పదవిలో ఉన్నప్పుడు మన హావభావాలు, నడవడి, మన తల్లిదండ్రులు నేర్పిన నైతికత ఇలా చాలా చాలా విలువలు ఉంటాయి. మన నేర ప్రపంచంలోనికే అందరిని తెద్దామన్న వ్యక్తిగత కక్షల ఆలోచన కాస్త పక్కన పెట్టి, మన వ్యవస్థ గురించి ఆలోచించండి మహాశయా. అదేనండి ప్రస్తుత సమస్య ఆంబులెన్స్ టాంకర్స్... ఓ సారి సారి..ఆక్సిజన్ టాంకర్స్ గురించి.
        మనకి వంటబట్టని భాషని నాశనం చేయాలన్న తలంపు మర్చిపోయి, కాస్త భాష మీద శ్రద్ధ పెట్టండి. నాగరికత, ఆధునికత బట్లర్ ఇంగ్లీష్ లోనూ, బట్లర్ తెలుగులోనూ ఉండదు. అలా మాట్లాడితే మనకు లేనిది రాదు. భరత్ అనే నేను సినిమా ఎన్నిసార్లు చూసినా, మనం భరత్ లు అయిపోము. ఆ గ్రేస్ పుట్టుకతో రావాలి. లేదా శ్రద్ధగా నేర్చుకుంటే వస్తుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే నక్క పులిగా మారిపోదన్న మన పెద్దల మాట ఓ పాలి యాదికి తెచ్చుకో. కనీసం అమ్మకి నీయమ్మకి తేడా తెలిస్తే అంకెలకి సంఖ్యలకి తేడా తెలుస్తుంది. భాషా ఉద్దండులు మీ పక్కనే ఉండి కూడా ఈ బట్లర్ భాష వినడానికి నిజంగా బాలేదు. కనీసం ఓ నిమిషం మీరే చూసుకోండి మీ మాటలు ఎలా ఉంటున్నాయెా మీకే తెలుస్తుంది. కోపం తెచ్చుకోకుండా వాస్తవాన్ని గమనించి మీ స్క్రిప్ట్ విషయంలో, పదాలు, భాష విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. 

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

citizen చెప్పారు...

భవనాలను నాశనం చేయడంలో మేము నిపుణులు.
అతను 10 వ తరగతి కూడా సరిగ్గా ఉత్తీర్ణత సాధించలేదు, అయినప్పటికీ అతను రాష్ట్రమంతా పరీక్షలు రాయమని బలవంతం చేస్తున్నాడు.
అతను ఏమి చేస్తున్నాడో లేదా ఏమి చదువుతున్నాడో ఎవరూ పట్టించుకోరు. వారు భిక్షగా నెలకు 1000 మరియు 5000 పొందుతున్నారు. అది చాలు.
అది మనం జీవిస్తున్న జాలి పరిస్థితి.
కానీ అతను ప్రజల నాడిని పొందాడు. ఒంటరిగా భారీగా సంపాదించడానికి బదులుగా, అవినీతిని సాధారణీకరించడానికి (normalization) అతను మొత్తం ప్రజలను భ్రష్టుపట్టించాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner