29, మే 2021, శనివారం

ఆధునిక సంస్కారం...!!

నేస్తం, 
       మనసు ఖాళీ అయితే మనిషి మనుగడ ఏంటంటావ్? ఈ సువిశాల ప్రపంచంలో మనసు లేని మారాజులెందరో మరి. నా నేస్తాలలో ఓ పెద్దాయనకి, నాకు ఎప్పుడూ మనసు విషయంలో చర్చ జరిగేది. ఆయన మనసు లేదు. అది మన ఊహ మాత్రమే అనేవారు. ఈ పెద్దోళ్ళందరూ ఇంతేనేమెా నాతో ఎప్పుడూ పోట్లాడుతూనే ఉంటారు. ఏది చెప్పినా ఒప్పుకోరు. 
      రచయిత రాతలకు, నిజ జీవితానికి ముడెట్టకండీ అని ఎంత మెుత్తుకున్నా..కుక్క తోక వంకరే కొందరికి. అతి వెగటుగా ఉంటుంది. మరి కొందరు శవాలలో కూడా ఎత్తుపల్లాలు చూసి ఆనందించే రకాలు. ఎదుటి మనిషి పరిస్థితిని అర్ధం చేసుకోకుండా గుడ్డెద్దు చేలో పడిన చందమే. 
      అందం అనేది రూపంలో ఉండదు. ఇష్టానికి, కోరికకి తేడా తెలుసుకుని ఛావండి. చలం చెప్పిన స్వేచ్ఛకు పెడర్థాలు తీసే మీ ఆధునిక ప్రేమలు మీ భార్య/భర్తల మీద, పిల్లల మీద ఒలకబోయండి. కాస్తయినా ఉపయెాగముంటుంది రేపటి రోజున. 
ఐ మిస్ యు అని అందరికి చెప్తూ మీ పబ్బం గడుపుకోవడానికి, మీ కాలం నడుపుకోవడానికి నాటకాలు వేయకండి. ఎవరి సమయాన్ని వారికి వదిలేయండి దయచేసి. నమస్కారం మీ ఆధునిక సంస్కారానికి...!! 
         

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner