29, మే 2021, శనివారం

కొన్ని జీవితాలింతే..!!

చీకటిలో మగ్గుతూ
వెలుగును చూడలేక

అమ్మతనం తనదేనంటూ
అభిజాత్యానికి పెద్ద పీట వేస్తూ

తండ్రిగా తనకే లక్షణాలు లేకున్నా 
అహమే తనకలంకారమనుకుంటూ

స్వార్థపు చెట్టు నీడలో పెరిగి
బిడ్డల బాగోగులు చూడలేక

విషాన్ని కుటుంబానికి పంచుతూ
విలాసంగా వినోదమే చూస్తూ 

నవ్వుల కన్నీళ్ల కానుకలను
నమ్మినవారికిస్తూ

అదే తన జీవితపు గెలుపని
భ్రమ పడుతున్న సగటు మనిషీ

చరిత్ర చెప్పిన సత్యం తెలుసుకో
ఎందరున్నా ఏకాకి బతుకే నీదని..!! 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner